ప్రస్తుతం భారతీయ రైల్వేలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ల హవా నడుస్తోంది.
దేశవ్యాప్తంగా రైళ్ల ట్రాక్ సామర్థ్యం 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా
వేస్తున్నప్పటికీ ప్రస్తుతానికి రూ.130 కిలోమీటర్ల గరిష్ట వేగానికే
అనుమతిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ రైల్వే 200 వందే భారత్ రైళ్లను తయారుచేసే
పనుల్లో నిమగ్నమైంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 8 వందేభారత్ లు నడుస్తున్నాయి.
ఇప్పటివరకు తయారైన బోగీలన్నీ తక్కువ దూరానికి ప్రయాణించేలా రూపొందించారు.
వీటిల్లో సిట్టింగ్ మాత్రమే ఉంటుంది. 2025 ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా
200 వందే భారత్ లు పరుగులు పెట్టనున్నాయి.తర్వాత ఎక్కువ దూరానికి అవసరమైన బోగీలను తయారుచేయాల్సి ఉంటుంది. స్లీపర్
బోగీలను త్వరలోనే ప్రవేశపెట్టబోతోంది. ప్రయాణికులకు కూడా ఇవి తెగ నచ్చేశాయి.
తొందరగా గమ్యాన్ని చేరుకుంటామనే ఉద్దేశంతో ధర ఎక్కువైనా లెక్కచేయడంలేదు.
ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వందేభారత్ రైలును స్లీపర్ కోచ్ లతో
రూపొందిస్తున్నారు. మేధా, ఐసీఎఫ్ అనే ప్రయివేటు సంస్థలు వందేభారత్ ను స్లీపర్
తో తయారుచేసే కాంట్రాక్ట్ ను ఆర్డర్ ను పొందాయి. టెండర్ల ప్రక్రియ ఈనెలాఖరులో
ముగియనుంది. 2025 చివరి నాటికి 278 వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు
తీస్తాయంటున్నారు.

ఆగస్టు 15 నాటికి 75 వందే భారత్ రైళ్లు నడుస్తాయని ప్రధానమంత్రి ప్రకటించారు.
టెండర్లు పొందిన రెండు కంపెనీలు వేగంగా ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి
ప్రయత్నిస్తున్నాయి. గతేడాది ఆగస్టు 15న ఎర్రకోట పై నుంచి 75 వందేభారత్ రైళ్లు
నడుస్తాయని ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి సమయం
తక్కువగానే ఉన్నప్పటికీ కోచ్ లు తయారుచేయడంలో మునిగిపోయివున్నాయి. చైర్
కార్లతో 78, స్లీపర్ కోచ్ లో 200 వందే భారత్ కోచ్ రైళ్లన్నీ ప్రారంభమవుతాయి.
రానున్న రోజుల్లో స్లీపర్ కోచ్ ల కోసం భారీగా డిమాండ్ ఉంటుందని, అందుకే వీటిని
తయారుచేస్తున్నామని కంపెనీలు ప్రకటించాయి.