గోదావరి జిల్లాల నుంచే మార్పు మొదలు కావాలి * రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి
ఒక్కరూ నడుం బిగించాలి * పులివెందుల సంస్కృతిని అన్ని చోట్లా తీసుకొచ్చారు *
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలులో నేతలతో జనసేన అధినేత పవన్
కల్యాణ్
రాజోలు : నేరగాళ్లు రాజకీయాలు చేస్తే రాష్ట్రం నాశనమవుతుందని జనసేన అధినేత
పవన్ కల్యాణ్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలులో జనసేన
నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. వైసీపీ నేతలు
పులివెందుల సంస్కృతిని అన్ని చోట్లకు తెచ్చారని పవన్ అన్నారు. నేరగాళ్ల
బెదిరింపులకు మంచివాళ్లు కూడా లొంగిపోతారని వ్యాఖ్యానించారు. వైసీపీ
చేసినట్లు తాను కుల రాజకీయాలు చేయలేనని చెప్పారు. విభిన్న కులాలు, మతాల నుంచి
జనసేన సభ్యులను తీసుకున్నట్లు వివరించారు. తమ పార్టీ ఓడిన తర్వాత కూడా
నిలదొక్కుకోవడమే గొప్ప విషయమన్నారు. ప్రజలకు జనసేన భావజాలం అవసరం ఉందని
అభిప్రాయపడ్డారు. ‘‘కుల, మత ప్రస్తావన రెచ్చగొట్టేందుకు కాదు. కుల సర్దుబాటు
కోసమే కులప్రస్తావన తీసుకొచ్చాను. రాజోలు విజయం జనసేనకు ఊపిరి పోసింది.
రాజకీయ పదవుల్లో మూడోవంతు మహిళలు ఉండాలి. ప్రజల హక్కులకు భంగం కలిగితే
పోరాడతా. ఎదురుతిరుగుతా. రూ. 200 లంచం తీసుకున్న ఉద్యోగికి శిక్ష పడుతుంది.
రూ. వేల కోట్లు దోపిడీ చేసే నేతలు పరిపాలన చేస్తున్నారు. మన ఓట్లు
తీసేస్తారు.. దొంగ ఓట్లు వేస్తారు.. జాగ్రత్త. మన ఓటుతో గెలిచి జవాబుదారీతనం
లేకపోతే కుదరదు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని ప్రజలు రీకాల్ చేయాలి.
రెఫరెండం పెట్టి అనర్హత వేటు వేసేలా చట్టాలు తీసుకురావాలి. గోదావరి జిల్లాల
నుంచే మార్పు మొదలు కావాలి. వచ్చే ఎన్నికలు మార్పునకు సంకేతం. రాష్ట్ర
భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
విప్లవపంథాతో ఉన్న రాజకీయ నాయకుడిని జగన్ చూడలేదు : జగన్ బాగా పరిపాలించి
ఇంకోసారి గెలిచినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఎవ్వరూ పోటీ చేయకూడదని బెదిరిస్తే
ఇప్పుటిదాకా రాజకీయ నాయకుడిని మాత్రమే చూశారు. కానీ విప్లవపంథాతో ఉన్న రాజకీయ
నాయకుడిని జగన్ చూడలేదని సీఎం జగన్‌ను జనసేనాని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తనకు వ్యక్తిగతంగా ద్వేషంలేదని పవన్
అన్నారు. కానీ సీఎం అయ్యాక తాను సర్వాధికారిని. అందరూ తన బానిసలంటే.. నీ
బాంచన్ దొర అంటూ నీ కాళ్లుమొక్కే వ్యక్తులంకాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారాహి యాత్రలో భాగంగా మలికిపురం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఈ మేరకు
మాట్లాడారు. వైసీపీ అవినీతి చదివేకొద్దీ తన కళ్ల సైట్ పెరిగిపోతుందని పవన్
అన్నారు. గోదావరి జిల్లాల్లో క్రిమినాలిటీని, చైన్ గ్యాంగ్స్, రౌడీ
గ్యాంగ్స్‌ను తీసుకురావద్దని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చైన్
గ్యాంగ్స్, రౌడీ గ్యాంగ్స్‌ను పులివెందుల, ఇడుపులపాయలో పెట్టుకోవాలంటూ సీఎం
జగన్‌పై పవన్ మండిపడ్డారు. వైసీపీ ప్రొత్సాహంతో క్రిమినల్స్ దాడి చేద్దామని
చూస్తే తాను విప్లవకారుడినని, రౌడీలు, క్రిమినల్స్, ఫ్యాక్షనిస్టులకు భయపడే
వ్యక్తిని కాదని హెచ్చరించారు. అభివృద్ధిపై ఏం మాట్లాడినా కేసులు పెడతామని
బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజోలు విజయం గాయపడ్డ గుండెకు
సేదతీరినట్లయిందని, రాజోలులో వెలిగించిన చిరుదీపం.. రౌడీలు, దౌర్జన్యాల పాలిట
అఖండజ్యోతి అవుతుందని పవన్ స్పష్టం చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టడానికి తాను
రాలేదని, కులాలను కలపడానికి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అన్నారు.