రాజకీయంగా ఎదగకుండా జగన్ అండ్ కో కుట్ర చేశారు
రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జగన్ విఫలం
వైసిపి నాయకులు సహజ వనరులను దోచుకుంటున్నారు
యుగ తులసి పార్టీ అధ్యక్షుడు కొలిశెట్టి శివ కుమార్
విజయవాడ : వచ్చే ఎన్నికల్లో యుగ తులసి పార్టీ ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలలో పోటీ చేస్తుందని యుగ తులసి పార్టీ అధ్యక్షుడు కొలిశెట్టి శివ కుమార్ వెల్లడించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే ఫుల్ ఫామ్ కూడా తెలియని వైసిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు నాయకులు ఉన్నారన్నారు. పార్టీ మొదటి ప్లినరీ లో పిల్లర్లుగా ఉన్న కొణతాల రామకృష్ణ, సబ్బం హరి తనతో బీసీ తీర్మానం చేయించారని, పార్టీ వ్యవస్థాపకునిగా నన్ను రాజకీయంగా ఎదగకుండా జగన్ అండ్ కో కుట్ర చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టిటిడి పాలకమండలిలో సభ్యునిగా రెండో సారి స్వామి వారికి సేవ చేసే అవకాశం కల్పించ లేదన్నారు. తండ్రి మార్గంలో నడుస్తాడని జగన్మోహన్ రెడ్డి కి ఈ పార్టీని అప్పగించడం జరిగిందని, రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జగన్ విఫలమయ్యారని, ఏ వర్గానికి న్యాయం చేయలేదని ప్రతి ఒక్కరు సమస్యలతో ఉన్నారన్నారు. అంగన్వాడీలు 40 రోజులుగా ధర్నా, దీక్షలు చేస్తున్న పట్టించుకోవడం లేదని, కనీసం వారి సమస్యలు పై స్పందించ లేదన్నారు. అమరావతి రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.
వైసిపి నాయకులు సహజ వనరులను దోచుకుంటున్నారని, కక్ష సాధింపు చర్యలకు దాడులకు పాల్పడుతున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఆర్థిక పరమైన లావాదేవీలు చేస్తున్నారని, ప్రజలకు చేరేది సున్నానే అన్నారు. తన వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటున్నారని, పార్టీ కోసం పని చేసిన ఎమ్మెల్యేలను వేరే నియోజకవర్గాలకు మారుస్తున్నారని, రేపు జరగబోయే ఎన్నికలలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి నే మారుస్తారని అన్నారు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు వైఎస్ఆర్సిపి పార్టీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని కూడా తెలీదని, తెలంగాణ లో వైస్సార్ పార్టీ ని క్లోజ్ చేసి ఆంధ్రా లో రాజ్యం ఏలుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. ఆంద్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అని, అలాంటి రాష్ట్రాన్ని ఇప్పుడు అడుక్కు తినేలా వైసిపి నాయకులుతయారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల గొంతులను నొక్కి దాడులు, దౌర్జన్యాలు పాల్పడుటూ తనకున్న డబ్బు మదంతోనే జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే అది ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ తేస్తాని ఓట్లు వేయించుకుని బిజెపి తో చేతులు కలిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు.
కేంద్రం మంత్రి అమిత్ షా, నరేంద్ర మోడీ సిఫార్సు చేసిన వ్యక్తులను టిటిడి పాలకమండలిలో నాలుగు సార్లు కృష్ణమూర్తిని నియమించారని, టిటిడి యాక్ట్ కి ఇది విరుద్ధమన్నారు. వైసిపి, బిజెపి ఒక్కటే అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలని, శ్రీవాణి ట్రస్ట్ వెయ్యి కోట్లను గో-సంరక్షణకు కేటాయించామని ముఖ్యమంత్రిని, టిటిడి చైర్మన్, టిటిడి ఈవో ను కోరిననా పట్టించుకో లేదన్నారు. అమ్మ ఆవు ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో “యుగ తులసి పార్టీ” ముందుకు వెళ్లుతున్నదని, రాష్ట్రంలో ఆవులు అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలకు, పశువులకు రక్షణ లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా యుగ తులసి పార్టీ తరపున పర్యటన చేస్తామని, త్వరలోనే ఒక స్వామీజీ చేరబోతున్నారని, ఆవుతోనే ఆరోగ్యం, అభివృద్ధి, ఐశ్వర్యమని అన్నారు. ఈ సమావేశంలో కె. సంగమేశ్వర చారి, చంద్రస్వామి, రాంబాబు, విక్రమ్ రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.