నగరి : వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని సినీ నటుడు ఆలీ జోస్యం
చెప్పారు. పార్టీ ఆదేశిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోటీ చేసేందుకు
సిద్ధమని తిరుపతిలో వ్యాఖ్యానించారు. ఎక్కడి నుంచైనా పోటీకి తాను రెడీ
అన్నారు. పవన్ కల్యాణ్ తనకు మంచి స్నేహితుడని, అయితే సినిమాలు వేరు,
రాజకీయాలు వేరని ఆలీ చెప్పారు. నిజ జీవితంలో ఆలీ, పవన్ కల్యాణ్ మంచి
స్నేహితులు. పవన్ కల్యాణ్ హీరోగా చేసిన ఒకట్రెండు సినిమాలు మినహా అన్నింటిలోనూ
ఆలీ నటించారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల బరిలో
నిలిచారు. ఆలీ మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. పవన్ గత అసెంబ్లీ
ఎన్నికల్లో భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం జనసేన
టీడీపీ మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. జనసేనాని బీజేపీ
అధిష్టానంతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. జనసేన తెలంగాణలో కూడా పోటీ చేయాలని
యోచిస్తోంది. వారాహి పేరుతో ఎన్నికల ప్రచారానికి పవన్ ఓ వాహనాన్ని కూడా సిద్ధం
చేసుకున్నారు.పవన్ ప్రస్తుతం మనల్ని ఎవడ్రా ఆపేది పేరుతో ఎన్నికల బహిరంగ సభలు నిర్వహిస్తూ
వైసీపీ నేతలపైన, ముుఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనా
విరుచుకుపడుతున్నారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా తనను ఏమీ
చేయలేకపోయారంటూ పవన్ కలకలం రేపారు. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ సభలకు ప్రజలు,
అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఓట్ల రూపంలో ప్రజలు
ఆశీర్వదిస్తానంటే ఒంటరిగా బరిలోకి దిగుతానని, లేదంటే శతృవును ఓడించేందుకు
పొత్తులు తప్పవని పవన్ వ్యాఖ్యానించండం ప్రాధాన్యతను సంతరించుకుంది. పవన్
గతంలో వామపక్షాలతోనూ స్నేహంగా ఉన్నారు. బీఎస్పీ అధినాయకత్వాన్ని కలిసి
పొత్తులో ఎన్నికలకు కూడా వెళ్లారు. అయినా కూడా ఆయనకు కలిసి రాలేదు. ఆ తర్వాత
తన వ్యూహాన్ని మార్చి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దగ్గరయ్యారు. మోదీతో
సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికలతో
పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ఎలాంటి వ్యూహాన్ని
అనుసరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.