వెలగపూడి : దేవాదాయశాఖతో పాటు వివిధ శాఖల్లో ప్రభుత్వ సలహాదారులను
నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం హైకోర్టులో విచారణ
జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ సలహాదారుల
నియామకం విషయంలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాగే వదిలేస్తే
తహశీల్దార్లకు కూడా సలహాదారులను నియమిస్తారేమోనని హైకోర్టు వ్యాఖ్యానించింది.
దేవాదాయశాఖతో పాటు వివిధ శాఖల్లో ప్రభుత్వ సలహాదారులను నియమించడాన్ని సవాల్
చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఐఏఎస్
అధికారులు ఉండగా వివిధశాఖలకు సలహాదారులు ఎందుకని ఈ సందర్భంగా ధర్మాసనం
ప్రశ్నించింది. సలహాదారుల నియామకానికి సంబంధించి రాజ్యాంగబద్ధతను తేలుస్తామని
స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ సలహదారులకు సంబంధించిన పూర్తి వివరాలను
కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గతంలో దేవాదాయశాఖ
సలహాదారుగా శ్రీకాంత్ ను నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే
విధించింది. స్టే ఉత్తర్వుల్లో సవరణ చేసి ఆయన సలహదారు పదవిలో కొనసాగేందుకు
అనుమతిచ్చింది. సలహదారుల నియామకంపై తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.