ప్రజాధ్యేయం (డక్కిలి ) జనవరి: 25 శుక్రవారం వెంకటగిరి సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు నాగార్జునసాగర్ చాపలపల్లి, మిట్టపల్లి నాగవోలు లింగసముద్రం గ్రామాల వరి పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎన్ఆర్ వరి 15048 వరి రకం ప్రస్తుతం పొట్ట దశ, వెన్ను దశలో ఉందని రాత్రి ఉష్ణోగ్రత తక్కువగా మంచు ఎక్కువగా ఉన్నందువలన అగ్గి తెగల్లు,మెడ విరుపు ఓరి పంటలో ఎక్కువగా ఉందన్నారు. వాటి నివారణకు ట్రై సైక్లోజల్ 120 గ్రాములు ఎకరానికి పిచికారి చేసుకోవాలని లేదంటే ఫిజియోన్ 350 గ్రాములు లేదా కాసు బి 500 గ్రాములు ఎకరానికి పిచికారి చేయాలన్నారు, అదేవిధంగా కొన్నిచోట్ల వరి లేత దశలో ఉందని ఆ పైరుకు ఆకు ముడత ఆశించటం గమనించడం వలన చిన్న గొంగళి పురుగు దశలో ఉన్నప్పుడు కాట్రాప్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు లేదా స్లుస్బెండోమైడు 25 ml ఎకరానికి పిచ్చికారి చేసుకుంటే వరిలో మంచి దిగుబడులు వస్తాయన్నారు. వరిలో పోటాష్ ఎరువులును తప్పనిసరిగా వేసుకోవాలన్నారు,ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి విజయ భారతి,వి ఏ ఒ గౌతమి, రైతులు పాల్గొన్నారు.