చెబుతున్న దాని ప్రకారం వర్షాకాలంలో చేపలు తినడం సరైన పద్ధతి కాదు. ఇతర
మాంసాహారాలతో సరిపెట్టుకోవడమే మంచిది.
1.వానా కాలం అనేది చేపలకు గుడ్లు పెట్టి పొదిగే కాలం. మీకు దొరికే చేపలన్నీ
అంతకుముందే పట్టి ఫ్రీజర్ లో దాచి అమ్ముతూ ఉంటారు.
2. వానాకాలంలో సముద్రంలో చేపలు పట్టేందుకు అనుమతి లేదు. భారీ వర్షాలు, గాలి
ఉన్నప్పుడు ఎవరు చేపలు పట్టేందుకు వెళ్లరు.
3. అలాంటప్పుడు మార్కెట్లో చేపలు ఎలా లభిస్తాయి? అవన్నీ కూడా ఫ్రీజర్ లో రోజుల
తరబడి నిల్వచేసిన చేపలే.
4. ఇలా నిల్వ చేసేందుకు కొన్ని రసాయనాలను కూడా వాడే అవకాశం ఉంది. కాబట్టి
అలాంటి చేపలను తీసుకోకపోవడమే మంచిది.
5. వర్షాకాలంలో కలుషిత నీరు నదులు, సముద్రాల్లో ప్రవేశిస్తాయి.
6. కలుషిత నీటిలో ఉన్న చేపలను పట్టి అమ్ముకునే వారు కూడా ఉన్నారు. అలాంటి
చేపలు తినడం వల్ల పచ్చకామెర్లు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కావున వర్షాకాలం పూర్తయ్యే వరకు చేపలను తినడం తగ్గించుకోవడం మంచిది.