సిద్ధంగా ఉంటాయి. అలాంటి కొన్ని వ్యాధులు వాటి లక్షణాలు:
డెంగ్యూ:
ప్రతి ఏడాది డెంగ్యూ వల్ల కొన్ని వందల మంది మరణిస్తూ ఉంటారు. డెంగ్యూ ఎడీస్
అనే జాతికి చెందిన ఆడదోమల వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలు సాధారణగా పగటి
పూటే మనుషులను కుడతాయి. అందువల్ల పగటి పూట కూడా ఇంట్లోకి దోమలు రాకుండా
జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఈ జ్వరం వచ్చిన వారికి విపరీతమైన తలనొప్పి,
వాంతులు, కళ్ల నొప్పులు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. రక్తంలో ప్లేట్లెట్స్
స్థాయిలు పడిపోతాయి. అందువల్ల ఎవరికైనా విపరీతమైన జ్వరం వస్తే వెంటనే
డాక్టరును సంప్రదించడం మంచిది.
మలేరియా:
నీళ్లు ఎక్కువ నిలిచిపోయిన చోట్ల నుంచి మలేరియా దోమలు వ్యాపిస్తాయి. అందువల్ల
ఇంటి పరిసరాల్లో వీలైనంత వరకూ నీళ్లు నిలిచిపోకుండా చూసుకోవటం మంచిది. మలేరియా
వచ్చినవారికి విపరీతమైన జ్వరంతో పాటుగా ఒళ్లు నొప్పులు, చలిజ్వరం ఉంటాయి.
మలేరియాను అశ్రద్ధ చేస్తే – జాండీస్, కిడ్నీల సమస్య వంటి ప్రమాదకరమైన జబ్బులు
వచ్చే అవకాశముంది.
చికెన్ గున్యా:
టైగర్ ఎడీస్ అల్బోపిక్టస్ అనే దోమల నుంచి చికెన్ గున్యా వ్యాప్తి చెందుతుంది.ఈ
దోమలు కుట్టిన మూడు నుంచి ఏడు రోజుల తర్వాత జ్వరం, కీళ్లనొప్పులు మొదలైన
లక్షణాలు కనిపిస్తాయి.
కలుషితమైన నీళ్లు లేదా ఆహారం వల్ల టైఫాయిడ్ వ్యాప్తి చెందుతుంది. విపరీతమైన
జ్వరం, కడుపు నొప్పి, ఆకలి లేకపోవటం ఈ జ్వర లక్షణాలు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
వీలైనన్ని ఎక్కువ సార్లు చేతులు కడుక్కొవాలి స్ట్రీట్ ఫుడ్ తినకూడదు. వీలైనంత
వరకూ
పానీపూరీ వంటి చిరుతిళ్లు తినకుండా ఉంటే మంచిది.
కాచిన నీళ్లనే తాగాలి.
దోమలు కుట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలి
చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నీళ్లు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.