పవన్ కళ్యాణ్ అజ్ఞానవాసి
2.6 లక్షల మంది వలంటీర్లలో 1. 8 లక్షలు ఆడపిల్లలే
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
అమరావతి : వలంటీర్ల వ్యవస్థ, వారి నియామకం, వారి విధులు, వారు ఎవరు అనే విషయం
గురించి తెలియని అజ్ఞానవాసి పవన్ కళ్యాణ్ అని, అందుకే ఉన్మాదిలా ప్రవర్తిస్తూ
నోటికొచ్చినట్లు అవాకులు చెవాకులు పేలుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,
దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. వెలగపూడి
సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2. 6 లక్షల మంది వలంటీర్లు ఉంటే వారిలో 1. 8 లక్షలు
ఆడపిల్లలేనని, వీరంతా 18-35 ఏళ్ళలోపు వారేనని తెలిపారు. అలాగే వలంటీర్లు 50
కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పధకాలను అందించటం, వారి బాగోగులు చూసేవారే తప్ప
పాకిస్తానీయులు కాదు.. వారూ మన పిల్లలే అని, పైగా వారంతా రాష్ట్రంలోని
నిరుద్యోగులేనన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గ్రహిస్తే మంచిదని హితవు పలికారు.
వలంటీర్లు సంఘ విద్రోహ శక్తులు ఎలా అవుతారని ప్రశ్నించారు. వారిని ఐఎస్వో
సభ్యులతో పోల్చడం, మతోన్మాదులుగా చిత్రీకరించడం దుర్మార్గమన్నారు. పవన్
కళ్యాణ్ ప్రసంగాలు, అతని మాటలు చూస్తుంటే నేను గతంలో చెప్పినట్లుగా
ఉన్మాదానికి ఎక్కువ.. పిచ్చికి కొంచం తక్కువ అన్నట్లు అతని పరిస్థితి ఉందని
వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పదవీ బాధ్యతలు తీసుకున్న తరువాత
సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల ముంగిటకే పాలన తీసుకువచ్చారని చెప్పారు.
ఈ వ్యవస్థను దేశంలోని ఇతర రాష్ట్రాలు మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం
ప్రశంసిస్తుందన్నారు. సచివాలయ వ్యవస్థ సజావుగా, సమర్థంగా నడవడానికి
రాష్ట్రంలోని నిరుద్యోగుల్లో పోటీ పరీక్ష ద్వారా సుమారు లక్షన్నర మందికి
ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిందన్నారు. మిగిలిన వారిలో అర్హతలున్న సుమారు
2.6 లక్షల మందికి వలంటీర్ ఉద్యోగాలిచ్చి కనీస గౌరవ వేతనం కింద రూ.5వేలు ఇచ్చి
వారి సేవలను సమాజ హితానికి ఉపయోగిస్తుందని, తద్వారా నిరుద్యోగుల్లో సేవా
భావాన్ని, స్ఫూర్తిని పెంచిందన్నారు. వలంటీర్ ఎవరని అడిగితే ప్రజల నుంచి మా
అమ్మాయే కదా.. మా అబ్బాయే కదా అని సమాధానం వస్తుందే తప్ప మరోకటి ఉండదన్నారు.
వలంటీర్ వ్యవస్థను మరో కోణం నుంచి విశ్లేషిస్తే .. 14 ఏళ్ళుగా పాతుకుపోయిన
మర్రిచెట్టులాంటి చంద్రబాబు దగాకోరు ప్రభుత్వం వలంటీర్లను నిరుద్యోగులని,
సోమరిపోతులని పిలిచేదని గుర్తు చేశారు. వారికి నిరుద్యోగభృతి, ముష్టి వంటి
పనికిమాలిన పేర్లు పెట్టి నెలకు రూ.2వేలు ఇచ్చేదని, కానీ.. నేడు సీఎం
వైయస్ జగన్ ప్రభుత్వం రూ.5వేలు ఇస్తుందన్నారు. వలంటీర్లలో అన్ని కులాలు,
పార్టీలు, మతాల వారు ఉన్నారని, వారు చూస్తున్న 50 కుటంబాలవారు చూపిస్తున్న
వాత్సల్యం, ప్రేమాభిమానాలతో వలంటీర్లు ఎంతో ఆనందంగా ఉన్నారని తెలిపారు. పవన్
కల్యాణ్ పిచ్చివాగుడు చూస్తుంటే.. వాడి నెత్తిమీద శని ఉన్నంత కాలం వాడు అలాగే
మాట్లాడతాడు అన్న మన పెద్దవాళ్ళ మాటలు గుర్తుకొస్తున్నాయన్నారు. అలాగే పవన్
కల్యాణ్‌కి చంద్రబాబు అనే శని ఉన్నంత కాలం అతను బాగుపడడని స్పష్టం చేశారు.
చంద్రబాబు, పచ్చ మీడియా కూడా ఇంతకుముందే వలంటీర్ వ్యవస్థపై పడి
ఏడుస్తున్నారని, ఎందుకంటే వలంటీర్ వ్యవస్థతో సీయం జగన్ మేరుపర్వతంలా
ఎదిగిపోవడంతో ఆయన్ని ఢీ కొట్టడం మన తరం కాదనే దుగ్దతో వాలంటీర్ వ్యవస్థపై
దుష్ప్రచారానికి దిగారని అన్నారు. పవన్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా
ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయని, ఇప్పటికైనా అతను ప్రశ్చాత్తాపం పడకపోగా
ఏలూరులో మళ్ళీ రెచ్చిపోయి కొత్త బూతులు తిట్టాడని అన్నారు. ఉమెన్
ట్రాఫికింగ్(మహిళల అక్రమ రవాణా) అంటే ఏమిటో కూడా తెలియని అమాయక
ప్రజల్లోను, ఆడపిల్లల మనస్సులో విషబీజాలు నాటాడని పేర్కొన్నారు. మొత్తంమీద
సమాజాన్ని చెడగొట్టడం తప్ప అతనికి వేరే పని లేదని అన్నారు. వాలంటీర్లంతా మన
ఇంటి వారేనని తెలుసుకుని వారికి బేషరతుగా క్షమాపణ చెప్పి ప్రాయశ్ఛిత్తం
చేసుకోవాలని, చంద్రబాబు చెడు సావాసం మానుకుని వాళ్ళ పొత్తు నుంచి బయట పడాలని
హితవు చెప్పారు. నీకు చెడు సలహాలు ఇచ్చి నీతో తప్పుడు మాటలు మాట్లాడించి, ఏ
మాటలను ప్రముఖంగా అచ్చు వేయించి ప్రజల్లో పవన్ పనికిమాలినవాడని తెలియచేయడమే
చంద్రబాబు అండ్ కో, పచ్చ మీడియా పన్నిన కుట్ర అన్నారు. నిన్ను రాజకీయ
బృహన్నలగా చేయడమే వారి ధ్యేయమని అన్నారు. ఇది తెలియక చంకలు గుద్దుకుంటున్న
నిన్ను చూస్తే జాలేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.