మధ్యధరా సముద్రంలో రక్షించబడిన 200 మందికి పైగా వలసదారులను తీసుకువెళుతున్న స్వచ్ఛంద నౌకను ఇటలీ ప్రభుత్వం ఇటీవల నిరాకరించడాన్ని గురువారం ఫ్రాన్స్ తప్పుపట్టింది. ఇటలీ వైఖరిపై ఫ్రెంచ్ అంతర్గత మంత్రి గెరాల్డ్ డర్మానిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన చర్య కాదంటూ ఇటలీ వైఖరిని తప్పుబట్టారు. ఓషన్ వైకింగ్ “ఇటలీ శోధన, రెస్క్యూ జోన్లో ఎటువంటి సందేహం లేకుండా ఉంది” అని అన్నారు. ఆశ్రయం కోరేవారికి సమష్టిగా మద్దతు ఇవ్వడానికి యూరప్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ఇటలీ ప్రభుత్వం అతిక్రమించిందన్నారు. ఫ్రాన్స్ సెంటర్-లెఫ్ట్ ప్రభుత్వం శరణార్థులను అనుమతిస్తుందని, అయితే వారిని మరింత న్యాయంగా పంపిణీ చేయడానికి యూరోపియన్ యూనియన్ వ్యవస్థలో ఇకపై పాల్గొనదని తెలిపింది. ఈ ప్రకటన ఇటలీ, ఫ్రాన్స్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచేలా చేశాయి. ప్రతి సంవత్సరం ఉత్తర ఆఫ్రికా నుంచి ఐరోపాకు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న వేలాది మంది వలసదారులను తీసుకోవడానికి ఇతర దేశాలు మరింత భారాన్ని భరించాలని ఫ్రాన్స్ పేర్కొంది.