విజయవాడ : నిరుద్యోగ ప్రభావంతో విదేశాలకు ఉద్యోగం కోసం పరుగులు తీస్తున్న
భారత యువతీ యువకులు వస్తూత్పత్తి, తయారీ రంగం పుంజుకుంటే ఉపాధి అవకాశాలు
మెరుగు పడతాయని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి
విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. సామాజిక మాద్యమాల వేదికగా సోమవారం ఈ
అంశాన్ని తనదైన శైలిలో వివరించారు. భారతదేశం నుంచి గత పదేళ్లకు పైగా విదేశాలకు
ఉపాధి, విద్యావకాశాల కోసం వెళ్లిపోతున్న యువతీయువకుల సంఖ్య గణనీయంగా
పెరుగుతోందని అన్నారు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న ఇండియాకు ఈ వలసల వల్ల
భారతీయులు తాము పనిచేస్తూ జీవిస్తున్న దేశాల నుంచి పంపే డబ్బు కూడా విపరీతంగా
పెరుగుతున్న మాట వాస్తవమే. మాతృదేశంలో తగినన్ని ఉపాధి అవకాశాలు లేకపోవడంతో
చదువుకున్న, నైపుణ్యత కల్గిన యువతీ యువకులు పశ్చిమాసియా, ఐరోపా, ఉత్తర
అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ తదితర దేశాలకు వలసపోతున్నారు. ప్రపంచంలో
స్వదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లి పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది భారతీయులే.
అందుకే ఈ రంగంలో ఇండియా ప్రథమ స్థానం ఆక్రమించింది. ఐక్యరాజ్య సమితి సంస్థల
అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఒక కోటీ 80 లక్షల మంది
భారతీయులు జీవిస్తున్నారు. 2022లో ఈ ప్రవాస భారతీయులు దాదాపు 100 బిలియన్
డాలర్ల సొమ్ము స్వదేశానికి పంపి ఉంటారని అంచనా. ప్రవాసులు స్వదేశానికి భారీ
మొత్తంలో డబ్బు పంపడంలో కూడా భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. ఇలా విదేశాల్లో
లభించే అవకాశాలను భారతీయులు ఉపయోగించుకోవడంలో తప్పులేదు. అలాగే, మాతృదేశానికి
విలువైన విదేశీ మారకద్రవ్యం పంపడం కూడా మంచిదే. కాని ఇండియాలో తగినన్ని ఉపాధి
అవకాశాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)లో పై స్థాయిల్లో ఉద్యోగాల సంఖ్య
ఆశించినంతగా లేకపోవడం వల్లనే విదేశాలకు భారత యువత వలసలు పెరిగిపోతున్నాయి.
సంపద, టెక్నాలజీ, వనరులు విషయంలో అగ్రరాజ్యమైన అమెరికాలో నిరుద్యోగం చాలా
తక్కువ. ఇప్పుడు ప్రపంచానికి ‘ఫ్యాక్టరి’గా మారిన చైనాలోనూ నిరుద్యోగం
తక్కువే. చైనాలో ఉపాధి అవకాశాలు అంత పెద్ద జనాభాకు తగినన్ని ఉండడానికి కారణం
అక్కడ వస్తూత్పత్తి–తయారీ రంగాల్లో నిరంతరం పెట్టుబడులు వచ్చిపడుతూ ఉండడమే.
అక్కడ ఉత్పాదక కార్యకలాపాలు భారీ స్థాయిలో సాగుతున్నాయి.
ఇండియాలో కూడా మాన్యుఫ్యాక్చరింగ్ రంగం బలోపేతం కావాలి : భారతదేశం నుంచి
వలసలకు అడ్డుకట్టవేయాల్సిన అవసరం లేదు గాని చదువుకున్న, శిక్షితులైన యువతకు
దేశంలోనే ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం ఉందని ఎందరో ఆర్థికవేత్తలు ఎప్పటి
నుంచో సూచిస్తున్నారు. సేవారంగం దేశంలో కొన్ని నగరాలకే పరిమితం కావడం, అందులో
బాగా నైపుణ్యం ఉన్నవారికే ఉపాధికి అవకాశాలు ఉండడం వల్ల ఈ రంగంలో ఉద్యోగాలు
పెద్ద సంఖ్యలో సృష్టించడం అంత తేలిక కాదు. అందుకే వస్తూత్పత్తి–తయారీ రంగంలో
ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని రిజర్వ్
బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వంటి ఆర్థికవేత్తలు
అభిప్రాయపడుతున్నారు.