గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్
విజయనగరం : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్
పై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ విమర్శలు చేశారు చేశారు. సీఎం జగన్ పేదల
కోసం ఇళ్లు కట్టిస్తుంటే అవి పవన్‌కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
‘చంద్రబాబు వంటి కిరాతకులు, రాక్షసులు అడ్డుపడ్డా జగనన్న ఇళ్ల నిర్మాణం
ఆగలేదు. ఇబ్బంది కలిగిందని ఒక్క లబ్ధిదారుడైనా పవన్‌కు ఫిర్యాదు చేశారా? ఇళ్ల
నిర్మాణాలు శరవేగంగా సాగుతుంటే కళ్ళు లేని కబోది లాంటి పవన్‌కు కనబడలేదా?
పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధి చూసి చంద్రబాబు, పవన్‌కు అసూయ కలిగింది.
గృహ నిర్మాణంపై జరుగుతున్న అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ చర్చకు రావాలని సవాల్
విసిరారు.