తెలుగు ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన తక్కువ కాలంలోనే అగ్రకథానాయికగా చెలామణి
అవుతుంది మరాఠీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాగూర్. ఈమె కెరీర్ ఆరంభంలో మరాఠీ ,హిందీ
భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించినప్పటికి ఆమె ప్రతిభకు తగిన గుర్తింపు
తెచ్చిపెట్టింది మాత్రం తెలుగులో ఆమె దుల్కర్ సల్మాన్ తో కలిసి నటించిన “సీతా
రామం”. ఈ చిత్రం మృణాల్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమాలో సీత పాత్రలో
అద్భుత నటన కనబరచి తెలుగు ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకుంది మృణాల్.
ప్రస్తుతం భామ తెలుగులో విజయ్ దేవరకొండ, నాని చిత్రాల్లో కథానాయికగా
నటిస్తున్నది. త్వరలో తమిళంలో కూడా నటించేందుకు సిద్దం అవుతుంది ఈ భామ. ఐదేళ్ల
కఠోర శ్రమ, నిరీక్షణ ఫలితమే తన విజయానికి కారణమని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.
మృణాల్ మాట్లాడుతూ ‘నటన పై విపరీతమైన వ్యామోహంతో, ఎలాంటి లక్ష్యాలను
పెట్టుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. సినిమా జయాపజయాల గురించి ఏ రోజు
ఆలోచించలేదు. ఎలాంటి పాత్రలో నటించేందుకు అవకాశం దక్కిన ఆ పాత్రకు పరిపూర్ణంగా
న్యాయం చేసేందుకు నా వంతు ప్రయత్నం చేశాను. నా సుదీర్ఘ నిరీక్షణకు నేడు ఫలితం
దక్కుతుంది. మనసుకు నచ్చిన మంచి పాత్రలు నన్ను వరి స్తున్నాయని ఆనందం వ్యక్తం
చేసింది ఈ భామ.