వాడెవడు లోకేష్…ఎప్పుడైనా అసెంబ్లీకి ఎన్నికయ్యాడా?. నామినేట్ చేస్తే
పదవులోకి వచ్చాడు…సర్పంచ్ అయ్యాడా…వార్డు మెంబర్ అయ్యాడా అతని గురించి
మేమేమి ఆలోచించేదని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
మండిపడ్డారు. శుక్రవారం అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. లోకేష్ పాదయాత్రను
అడ్డుకునేందుకే ప్రభుత్వం జీఓ తెచ్చిందా? అని విలేకరులు ప్రశ్నించగా
తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పైవిధంగా స్పందించారు. ఇంకా ఏం మాట్లాడరంటే… మేం
అధికారంలోకి వస్తే అది పీకుతాం..ఇది పీకుతామని మాట్లాడుతున్నారు. మేం ఇప్పుడు
అధికారంలో ఉన్నాం. పీకాలనుకుంటే ఎంతసేపు. వాడు అయ్యన్నపాత్రుడు చెత్తనాకొడుకు.
అయ్యన్న పాత్రుడు ఆక్రమించుకుని నిర్మించిన కట్టడాలను కూలగొట్టే అధికారం
ప్రభుత్వానికి ఉంటుంది. నిబంధనల ప్రకారమే ప్రభుత్వం పని చేస్తుంది. మీమీద
కేసులు పెట్టే పరిస్థితులు మీరే కల్పించుకున్నారు. మీ తప్పిదాలను కప్పి
పుచ్చుకోవడానికి ప్రభుత్వంపై ఏది పడితే అది మాట్లాడతారా?. నేను మగోడిని కాదో
లేదో ఆవిడకే తెలుసు అంటూ రోజాను ఉద్దేశించి మాట్లాడతావా. ఇంత నీచపు సంస్కృతికి
టిడిపి దిగజారుతోంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న సీనియర్
నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి. రామారావు గారి విలువలకు తిలోదకాలు ఇచ్చారు.
రామారావు గారి గౌరవాన్ని సమాధి చేస్తున్నారు. అక్రమ సంపాదనతో పార్టీని సర్వ
నాశనం చేశారు. ఐదేళ్లు మీకు అధికారం ఇస్తే ప్రజలను వంచించి మోసగించడంతో
తిరస్కరించారు. ప్రజాధనాన్ని దోచుకుని దాచుకోవడంతో మదమెక్కి మాట్లాడుతున్నారు.
ఖబడ్దార్ అయ్యన్నపాత్రుడూ..మీతీరు మార్చుకోకుండా ఇలాగే మాట్లాడితే దాని
పర్యావసనాలు∙2024 తర్వాత కాదు ఇప్పుడే ఉంటాయి.
చెత్తపార్టీలోని చెత్త నాయకులు సర్వేల పేరుతో వారి కార్యకర్తలను కూడా మోసం
చేస్తున్నారు. మళ్లీ గెలుస్తాం గెలుస్తామని చెబుతున్నారు. తెలుగుదేశం
పార్టీలో 420లు నాయకత్వం వహిస్తున్నారు. ఈ 420 గాళ్లు ఫేక్ సర్వేలను ప్రచారం
చేస్తూ కేడర్‌లోని ఆశలను చావకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే
అదే అస్త్రంగా ప్రయోగించి జగన్మోహన్ రెడ్డి గారిమీద, వైఎస్సార్‌కాంగ్రెస్
పార్టీ ఎమ్మెల్యేల మీద ఎంతగట్టిగా మాట్లాడితే అంత ఇదిగా ప్రజలు నమ్ముతారని
అనుకుంటున్నారు. ప్రజలకు తెలీదా…టిడిపి ప్రభుత్వంలో ఏ ఇంటికి ఎంత లబ్ది
జరిగిందనేది. ఇప్పుడు జగనన్న 40 నెలల పరిపాలనలో ఎంత లబ్ధి జరిగిందీ జనాలకు
అర్థం చేసుకోలేరా? మంచి చేసిన వాళ్లను ప్రజలు ఆదరించరా? మినిమం కామన్సెన్స్
ప్రజలకు లేదనుకుంటున్నారా?. మీకు లేకపోయి ఉండొచ్చు. లేదా మీరు నటిస్తుండొచ్చు.
మీ కార్యకర్తలను మోసం చేస్తుండొచ్చు. తెలుగుదేశం పార్టీ ఉనికే లేదు. 150
నియోజకవర్గాల్లో టిడిపికి లీడర్‌షిప్పే లేదు. ప్రతిపక్షంగా నిర్వహించాల్సిన
పాత్రే లేదు. వీధుల్లోకి వచ్చి జగన్మోహన్రెడ్డిని, ఎమ్మెల్యేలను తిట్టడం
తప్ప సాధించిందేమీ లేదు. మీకు ప్రచారంపై ఉన్న పిచ్చి, మోజుతో అమాయక జనాలను
చంపారు. పవన్‌కళ్యాణ్ పార్టీ పెట్టిందే చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు.
ఇద్దరూ విడిపోయినట్లు నటించి ఇప్పుడేమో అందరూ కలిసి జగన్మోహన్రెడ్డిని
ఓడిస్తామంటున్నారు. జగన్మోహన్రెడ్డిని ఓడించడం అంటే ప్రజలను ఓడించడమే. ఇది
అత్యాశేనని ఆయన అన్నారు.