విజయవాడ : మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేలా వాయు, జల, శబ్ధ, కాలుష్య
నివారణకు సమిష్టిగా కృషి చేద్దామని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా పదవీ
బాధ్యతలు చేపట్టిన డా. సమీర్ శర్మ అన్నారు.
కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా నియమితులైన డా. సమీర్ శర్మ విజయవాడ
కస్తూరిబాయి
పేటలోని చలమలవారి వీధిలోగల కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో శుక్రవారం
పదవీభాధ్యతలు
స్వీకరించారు. ఈ సందర్భంగా డా. సమీర్ శర్మ మాట్లాడుతూ కాలుష్యాన్ని
నియంత్రించి స్వచ్చమైన వాతావరణాన్ని
సమాజానికి అందించడంలో అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. మురుగునీరు,
వాణిజ్యవర్గాల శుద్ధి
ప్లాంట్లపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ
అభివృద్ధి కార్యక్రమాలు వంటి
విషయాలలో ఎప్పటికప్పడు సమీక్షించి మెరుగైన ఫలితాలను సాధించేందుకు కృషి
చేస్తానని డా. సమీర్ శర్మ
తెలిపారు.
కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్, చీఫ్ ఎన్వరాన్మెంటల్
ఇంజనీర్ బి.
శివప్రసాద్, జాయింట్ ఛీఫ్ ఎన్వరాన్మెంటల్ ఇంజనీర్లు కె. వెంకటేశ్వరరావు, యం.
శివారెడ్డి, కె. శ్రీరాంమూర్తి,
ఎన్వరాన్మెంటల్ ఎస్ఇ పి. రవీంద్రనాద్, జోనల్ ఆఫీసర్ ఎన్ బాస్కరరావులు చైర్మన్
గా పదవీ బాధ్యతలు చేపట్టిన
డా. సమీర్ శర్మ కు శుభాకాంక్షలు తెలిపారు.