సంక్షేమ పథకాలు అందరికీ అందించేందుకు వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేశారు
వాలంటరీ లు అంటే జగనన్న మానస పుత్రికలు
చంద్రబాబు వాలంటరీ వ్యవస్థను తిట్టినప్పుడు సీపీఎం వాళ్లు ఏమి చేశారు
పేదలకు మంచి చేసే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి
సీపీఎం సీపిఐ జనసేన మోసిన చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు
పెత్తం దారులకు కొమ్ము కాస్తున్న పార్టీ సీపీఎం : వెలంపల్లి శ్రీనివాస రావు
విజయవాడ : స్థానిక 46వ డివిజన్ కె ఎల్ రావు పార్క్ వద్ద 46,47,48,49, 50
డివిజన్ల వార్డు సచివలయలలో సేవలు అందుస్తున్న వార్డ్ వాలంటీర్లందరికీ శనివారం
సేవా మిత్రా సేవ రత్న సేవ వజ్ర పురస్కారాల మహోత్సవం జరిగింది. ఈ మహోత్సవంకు
మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు
ముఖ్యఅతిథిగా విచ్చేసి పురస్కర గ్రహితలకు శాలువా కప్పి ప్రశంస పత్రాలు
అందిచారు.
ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఈ పురస్కారాలు ఇవ్వడం
సంతోషంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలు అందరికీ అందించేందుకు వాలంటరీ వ్యవస్థ
ఏర్పాటు చేశారన్నారు. వాలంటరీ లు అంటే జగనన్న మానస పుత్రికలన్నారు. చంద్రబాబు
వాలంటరీ వ్యవస్థను తిట్టినప్పుడు సీపీఎం వాళ్లు ఏమి చేశారన్నారు. ఉద్యమాలతో
పని లేకుండా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా
పథకాలు ఇస్తున్నామన్నారు.
పేదలకు మంచి చేసే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు.తప్పని పరిస్థితుల్లో
ప్రతి పక్షాలు వాలంటరీ వ్యవస్థను మొచ్చుకుంటున్నరన్నారు. వాలంటరీ వ్యవస్థను
గౌరవిస్తూన్నాం వారికి గుర్తింపు ఇవ్వడం జరుగుతుందన్నారు. సీపీఎం సీపిఐ జనసేన
మోసిన చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడన్నారు.పెత్తం దారులకు కొమ్ము కాస్తున్న
పార్టీ సీపీఎం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి 48వ
డివిజన్ కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి,47వ డివిజన్ కార్పొరేటర్ గోదావరి
గంగా, బంక విజయ,రాయన నరేంద్ర, గోదావరి బాబు కురాకుల నాగ, బూదాల శ్రీను బంక
చాముండేశ్వరి,పీళ్ళ సూరిబాబు(జగ్గు),వానపల్లి త్రిమూర్తులు, తోత్తడి
వరలక్ష్మి, తదితర నాయకులు కార్యకర్తలు, నగర పాలక సంస్థ అధికారులు సచివాలయ
సిబ్బంది, పురస్కార గ్రహీతలు పాల్గొన్నారు.