విజయవాడ : స్థానిక 34 వ డివిజన్ కేదారేశ్వర పేట విఎంసి కళ్యాణ మండపం నందు
34,35,55 మరియు 56 డివిజన్ల వార్డు సచివాలయలో సేవలు అందిస్తున్న వార్డు
వాలంటీర్లందరికీ మంగళవారం సేవా మిత్రా, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాల
మహోత్సవం జరిగింది. ఈ మహోత్సవంకు మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గం శాసన
సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా విచ్చేసి పురస్కార గ్రహితలకు
శాలువ కప్పి ప్రశంస పత్రాలు అందించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ
అన్ని రకాల పథకాలు ప్రజలకు అందించేందుకు వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు
చేశామన్నారు.వాలంటరీ లకు శుభాకాంక్షలు తెలిపారు.అందరూ మంచిగా పని చేసి
ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన
భాగ్యలక్ష్మి ఆయా డివిజన్ల కార్పొరేటర్లు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్
కార్పొరేషన్ చైర్మన్ బండి పుణ్యశిల రాజ్ కుమార్, బలసాని మన్నెమ్మ, శీరంసెట్టి
పూర్ణ, యాలకల చలపతి రావు, నాయకులు, కార్యకర్తలు, నగర పాలక సంస్థ అధికారులు,
సచివాలయ సిబ్బంది, పురస్కార గ్రహీతలు పాల్గొన్నారు.