టీడీపీ పాలనలో పథకాలను కూడా అమ్ముకున్నారు
వాలంటీర్ వ్యవస్థ పై తప్పుడు రాతలు భావ్యం కాదు
వైసీపీ ప్రభుత్వం లో వాలంటీర్ల ద్వారా పార్టీలకతతంగా పథకాలు
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు
అనకాపల్లి : తప్పుడు కథనాలు రాతలు ఇకనైనా మానుకోవాలని వాస్తవాలు
ప్రచురించకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు ఈనాడు పత్రిక చేసే ప్రయత్నాలు ప్రజలు
గమనిస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు అన్నారు.
మార్గదర్శి మోసాలు బట్టబయలు కాకుండా ప్రజలను మోసం చేస్తున్న రామోజీరావు,
డ్రామోజీ రావుగా పేరు మార్చుకోవాలని సూచించారు. డిప్యూటీ సీఎం క్యాంపు
కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికాసమావేశంలో ముత్యాల నాయుడు మాట్లాడుతూ పక్క
రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్న వాలంటీర్ వ్యవస్థ పై తప్పుడు రాతలు భావ్యం కాదని,
ప్రతి నెల ఒకటో తారీఖు వృద్ధులకు, వికలాంగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వచంద
సేవ చేస్తున్న వారిపై ఈ రాతలు అమానుషమని వాలంటీర్ వ్యవస్థపై పొరుగు రాష్ట్రాలు
ప్రశంసలు కురిపిస్తున్నాయని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళ కు
సైతం వాలంటీర్ నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారని, జన్మభూమి కమిటీ ల ద్వారా
సమాజంలొ పేరుకుపోయిన అవినీతికి చరమగీతం పడినందుకే ఈ కక్షపూరితగా రాతలు,
జన్మభూమి కమిటీలు రౌడీలను తయారు చేసినప్పుడు రామోజీ రావు ఎక్కడున్నదని
ప్రశ్నించారు.
అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వెతికి వెతికి చేస్తున్న సీఎం జగన్ పరిపాలనలో
వాలంటీర్ వ్యవస్థ జవాబుదారీతనం తెచ్చిందని, త్వరలోనే డ్రామోజీ రావు తప్పుడు
రాతలకు , టీడీపీ జిత్తులమారిన నక్క చంద్రబాబు మోసాలకు ప్రజలు బుద్ధి
చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వ్యవస్థను
అవినీతిమయం చేయడమే కాకుండా చంద్రబాబు విధి విధానాల ద్వారా గ్రామీణ వ్యవస్థ
అభివృద్ధి గాడి తప్పేలా చేశారని, వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు సమూల మార్పులు
దిశగా గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవనాలు విలేజ్ హెల్త్ క్లినిక్,
డిజిటల్ లైబ్రరీ వంటి వాటిని ఏర్పాటు చేశామని, గడప గడపకు వెళ్ళి ప్రజలకు సేవ
చేసిన ఆనవాళ్లు టీడీపీ హయాంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. టీడీపీ పాలనలో
పథకాలను అమ్ముకున్నారని, వైసీపీ ప్రభుత్వం లో వాలంటీర్ల ద్వారా పార్టీలకతతంగా
పథకాలు అందిస్తున్నామని అయన తెలిపారు.