రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో ఉన్నప్పటికీ తాను ఈ సంవత్సరమే అసలైన సంక్రాంతి
వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా జరుపుకుంటున్నానని తూర్పుగోదావరి జిల్లా కడియం
మండలం దుళ్ల గ్రామానికి చెందిన సినీ ఎడిటర్ చోటా కె ప్రసాద్ తెలిపారు. ఆ
సినిమాకు ఈయన ఎడిటర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆ సినిమా థియేటర్లలో అద్భుతమైన
కలెక్షన్లు సాధించడంతో ప్రసాద్‌కు మంచి గుర్తింపు వచ్చింది.సంక్రాంతికి
స్వగ్రామం వచ్చిన ప్రసాద్ స్థానిక విలేఖరులరో మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు
ప్రతి ఏటా స్వగ్రామం వస్తానని కానీ అసలైన సంక్రాంతి ఈ ఏడాది
జరుపుకుంటున్నానని ఆనందం వ్యక్తం చేసారు. సినీ రంగంలో ప్రముఖ కెమెరామెన్లు
చోటా కె నాయుడు, శ్యాంమ్ కె నాయుడులు ఈయన బాబాయిలు.అయితే బాల్యం నుంచి
చిరంజీవి అభిమాని అయినటువంటి ప్రసాద్ సినీ రంగంలోకి రావాలనే కోరిక చోటా కె
నాయుడు అందించిన సహకారంతో నెరవేరింది. అంచలంచెలుగా ఎదుగుతూ ఎడిటర్
స్థిరపడ్డారు.సినిమాలు ఫిలిం(రీల్స్) నుంచి డిజిటల్ గా మారే సమయంలో ఈయన
ఎడిటింగ్ లో నైపుణ్యం సాధించారు.ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు వద్ద అసిస్టెంట్
ఎడిటర్ గా ఎనిమిది ఏళ్ల పాటు పనిచేసారు. సుమారు 150 సినిమాలకు ఎడిటింగ్
షెడ్యూల్లో కీలక పాత్ర పోషించారు. అందులో ఎన్నో అద్భుత విజయాలు అందుకున్న
సినిమాలో ఉన్నాయి. ఆ తర్వాత ఆయనకే ఎడిటింగ్ చేసే ఆకాశం వచ్చింది ఇప్పటివరకు
36 సినిమాలు ఎడిటర్ గా వ్యవహరించారు. తాజాగా విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా
ఎడిటింగ్ లో ఇతను కనబరిచిన ప్రతిభ మెగాస్టార్ చిరంజీవితో పాటు సినీ రంగా
ప్రముఖులను ఆకర్షించింది.అ సినిమా ప్రేక్షకులను అలరింప చేయడంలో ప్రసాద్
ఎడిటింగ్ చేసిన తీరు ప్రశంసలు అందుకుంటుంది.హీరో చిరంజీవి ప్రసాద్ ను
ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఎడిటర్ గా ఎక్లడకి పోతావు చిన్నవాడా,దువ్వాడ
జగన్నాధం,గద్దరకొండ గణేష్, నాంది వంటి సినిమాలు మంచి గుర్తింపు పొందాయి.
ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా అందరి ఆదరాభిమానాలు
అందుకుంటున్నారు.బంధుమిత్రులు అయన ఇంటికి దుళ్ల వచ్చి ప్రత్యేకంగా
అభినందిస్తున్నారు.అలాగే పలువురు ప్రజాప్రతినిధులు, చిరంజీవి అభిమానులు
ప్రసాద్ ను సత్కారాలతో ముంచెత్తి తున్నారు.