బబితా ఫొగాట్ అన్నారు. అలానే, వారి ఆందోళనల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని
బయటపెట్టాలని బబిత డిమాండ్ చేశారు. మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్, ఆమె భర్త
సత్యవర్థ్ కడియాన్ కాంగ్రెస్ చేతిలో కీలు బొమ్మలుగా మారారని మరో మహిళా
రెజ్లర్, భాజపా నాయకురాలు బబితా ఫొగాట్ విమర్శించారు. భారత రెజ్లింగ్
సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా జనవరిలో
జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసేందుకు బబితా ఫొగాట్, తీర్థ్ రాణా అనుమతి
తీసుకున్నారని సాక్షి మాలిక్, ఆమె భర్త ఆరోపిస్తూ శనివారం ఓ వీడియో
సందేశాన్ని విడుదల చేశారు. దీనిపై బబిత ఫొగాట్ స్పందిస్తూ సాక్షిమాలిక్
ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ‘‘తమ సమస్య పరిష్కరించాలని ధర్నా చేస్తున్న
మహిళా రెజ్లర్లకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ముందు నుంచి నేనే వారికి
ప్రధానమంత్రిని లేదా కేంద్ర హోం మంత్రిని కలిసి తమ సమస్యను విన్నవించుకోవాలని
సూచిస్తున్నాను. కానీ, వారు ప్రియాంక గాంధీ, దీపేందర్ హుడాలతోపాటు ఇతర
కాంగ్రెస్ నాయకుల నుంచి సహాయం కోరారు. నాకు ప్రధానితో దేశ న్యాయవ్యవస్థపై
పూర్తి నమ్మకం ఉంది. నిజమేంటో త్వరలోనే బయటపడుతుంది. నిన్న వీడియోలో సాక్షి
మాలిక్, ఆమె భర్త చెప్పిన మాటలు ఎంతో బాధ కలిగించాయి. జనవరిలో ధర్నా కోసం
అనుమతి తీసుకున్నామని వారు చూపించిన పత్రాల్లో నా సంతకం, పేరు ఎక్కడా లేవు.
ఇప్పటికైనా వారి ఆందోళనల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని బయటపెట్టాలని
కోరుతున్నా. కాంగ్రెస్ చేతిలో కీలు బొమ్మల్లా వారు వ్యవహరిస్తున్నారు’’ అని
బబిత ట్వీట్లో పేర్కొన్నారు.
మమ్మల్ని ఎవరూ బెదిరించలేదు : మరోవైపు, తమను ఎవరూ బెదిరించలేదని, తమకు తెలిసిన
నిజాన్ని మాత్రమే బయటకు వెల్లడించామని మైనర్ బాలిక తండ్రి అన్నారు. రాజకీయ
పెద్దల బెదిరింపుల కారణంగానే బ్రిజ్ భూషణ్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మైనర్
బాలిక తన వాంగ్మూలాన్ని మార్చి చెప్పిందని సాక్షి మాలిక్ ఆరోపించారు. అయితే,
ఈ ఆరోపణలను మైనర్ బాలిక తండ్రి ఖండించారు. సాక్షి చేసిన ఆరోపణలపై వివరణ
ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బ్రిజ్ భూషణ్‌పై దిల్లీ పోలీసులు గత వారం 1500
పేజీల చార్జిషీట్‌ను పటియాలా హౌస్ కోర్టులో దాఖలు చేశారు. అలానే,
బ్రిజ్‌భూషణ్‌పై నమోదైన పోక్సో కేసును రద్దు చేయాలని పోలీసులు న్యాయస్థానాన్ని
కోరారు. ఈ నేపథ్యంలో సాక్షి మాలిక్ తమ ఉద్యమం వెనుక రాజకీయ ఉద్దేశం లేదని,
గతంలో రెజ్లర్ల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే ఫిర్యాదు చేయలేదని తెలిపారు.