బాలాయపల్లి :-
తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం, బాలా యపల్లి మండలం,సంగవరం గ్రామంలో “వికసిత్ భారత్ సంకల్పయాత్ర ” బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ ఎస్. ఎస్. ఆర్ నాయుడు ఆద్వర్యంలో గురువారం జరిగింది.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన విశ్వకర్మ యోజన ఆవాస యోజన కిసాన్ సమాన్ నిధి యోజన అలా అనేక కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి, వాటి ప్రయోజనాల గురించి సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలందరికీ తెలియ జేయాలని అధికారులు చూసుకోవాలన్నారు, అర్హులైన వారందరికీ అవి అందేలా చేయాలన్నా రు. నరేంద్ర మోడీ క్యాలెండర్లు,తొమ్మిది సంవత్స రాల సుపరిపాలన కరపత్రములు, అందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజేపి మండల ప్రెసిడెంట్ నీలకంఠం.మురళి ,వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, భారతీయ జనతా పార్టీ మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
పోటో:-మాట్లాడుతూన్న దృశ్యం