వాంతులు ఎక్కువగా అవ్వటం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ కు
గురవుతారు. నీటిని తాగడం వల్ల శరీరం రీహైడ్రేట్ అవుతుంది. ద్రవాహారం కడుపులో
తేలిగ్గా జీర్ణమై . ఉపశమనం కలిగిస్తుంది.
ఓఆర్ఎస్ తీసుకోండి:
ఓ.ఆర్.ఎస్.తీసుకోవడం వల్ల నీరసం తగ్గి శరీరంలో ఓపిక పుంజుకుంటుంది. ఈ
పానీయాన్ని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. 200 మి.లీ నీటిలో రెండు స్పూన్ల
పంచదార, చిటికెడు ఉప్పు, అరస్పూన్ . నిమ్మరసం, చిటికెడు జీలకర్ర పొడి, ఐదారు
పుదీనా ఆకులు వేసుకుని కలిపి తాగండి. ఇది వాంతులను తగ్గించటంలో సహాయపడుతుంది.
ప్రాచీన కాలం నుంచీ దీన్ని ఔషదంలా వాడుతున్నారు.
అల్లం:
వాంతుల తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది యాంటీ
ఎసిటిక్ గుణాన్ని కలిగి ఉంటుంది. వికారం, వాంతుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
దీన్ని నేరుగా తినలేని వారు కాస్త ఉప్పులో అద్దుకుని తింటే సరి.
జీలకర్ర:
జీర్ణానికి సహాయపడే వాటిలో జీలకర్ర ఒకటి. దోరగా వేయించి చిటికెడు ఉప్పుతో
కలిపి నోట్లో వేసుకుని నమిలితే చాలు… వాంతులను ఆపేయొచ్చు.
నిమ్మరసం:
గ్లాసు నీటిలో అరచెక్క నిమ్మ రసాన్ని పిండుకొని తాగితే ఈ ఇబ్బందికి అడ్డుకట్ట
వేయొచ్చు. ఒకవేళ నేరుగా తాగలేకపోతే కాస్త ఉప్పు చల్లీ పిండుకొని తాగితే ఈ
ఇబ్బందికి అడ్డుకట్ట వేయొచ్చు. ఒకవేళ నేరుగా తాగలేకపోతే కాస్త ఉప్పు చల్లీ
తీసుకోవచ్చు. ప్రయాణాల్లో దీని వాసన పీల్చినా సమస్య సమస్యను దూరం చేస్తుంది.
లవంగాలు: నోట్లో రెండు లవంగాలను వేసుకోండి దీని వాసన, రుచీ వాంతులను ఆపడానికి
సహాయపడతాయి. అలాగే లవంగం టీ తాగినా ఫలితంఉంటుంది.