జననీరాజనం పలుకుతున్న ప్రజానీకం
రాష్ట్ర ప్రజలకు దగ్గర కావడానికి అనేక కార్యక్రమాలను నిర్వహించాం
రాష్ట్ర అటవీ విద్యుత్ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భగనుల శాఖ మంత్రి
డా.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు : రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష క్యాంప్ లు విజయవంతంగా
నిర్వహించడం జరుగుతున్నదని, దీని ద్వారా ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు
ప్రజలకు అందుతున్నాయని రాష్ట్ర అటవీ విద్యుత్ పర్యావరణ శాస్త్ర సాంకేతిక
భూగర్భ గనుల శాఖ మంత్రి డా.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
శుక్రవారంపుంగనూరు మున్సిపాలిటీలో రెండవ రోజు వార్డు బాట కార్యక్రమంలో భాగంగా
14, 16, 17, 18, 21, 22, 23 వార్డుల్లో తేరు వీధి సచివాలయం- 1, తూర్పు మొగ
సాల, నాన్నబాలవీధిలలో ని గడప గడపనూ ఆత్మీయంగా పలకరించిన మంత్రికి ప్రజానీకం
జననీరాజనం పలికారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, స్థానికంగా వారికున్న
సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. వార్డు బాటలో భాగంగా వివేకానంద కాలనీలో
మంజూరైన 20 లక్షలతో చేపట్టే సీసీ డ్రైన్స్, కుమ్మర వీధి నందు పుంగనూరు
మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నిధులు రూ.6.71 లక్షల తో చేపట్టే సీసీ రోడ్డు మరియు
డ్రైన్,రూ.5.50 లక్షల జిజిఎంపి నిధులతో ఉర్దూ స్కూలు వీధి నందు సిసి రోడ్డు
నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర
ప్రభుత్వం ప్రజలకు మేలు కలిగించే ప్రతి కార్యక్రమం నిర్వహించడం ద్వారా వారికి
చేరువవుతున్నదని అన్నారు. ప్రభుత్వం తరఫున అందించే జనన, మరణ, ఆదాయం, కుల
ధృవీకరణ వంటి 11 రకాల ధృవీకరణ పత్రాలను జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా
క్యాంప్ జరుగుతున్న సచివాలయంలో అదే రోజు ఉచితంగా అందించడం జరుగుతున్నదన్నారు.
దీని ద్వారా అర్హత కలిగి సంక్షేమ పథకాలు పొందని వారు లబ్ధి పొందవచ్చునని
అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలన్నారు. ఈ
కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళల కార్పొరేషన్ చైర్మన్ కొండవీటినాగభూషణం,
పలమనేరు కుప్పం మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకట్
రెడ్డియాదవ్, ఎంపీపీ భాస్కర్ రెడ్డి,మునిసిపల్ చైర్మన్ ఆలీమ్ భాషా,మున్సిపల్
కమిషనర్ నరసింహ ప్రసాద్, తహసీల్దారు సీతారాం, ఇతర సంబంధిత అధికారులు ప్రజా
ప్రతినిధులు, నాయకులు పెద్దిరెడ్డి జింకా చలపతి, ఎంఆర్ సి రెడ్డి, జయచంద్ర
రెడ్డి చంద్రారెడ్డి యాదవ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.