సూళ్లూరుపేట : శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి
ప్రయోగించిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)-సి54 రాకెట్
ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్వీ సీ-54 రాకెట్ ద్వారా 9 ఉపగ్రహాలను
కక్ష్యలోకి పంపించారు. ఈవోఎస్ శాట్-6 సహా 8 నానో ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ
సీ-54 నిర్దేశిత కక్ష్యలోకి మోసుకెళ్లింది. ఓషన్ శాట్ ఉపగ్రహాల ద్వారా
భూవాతావరణం పరిశీలన, తుపానులను పసిగట్టడం, వాతావరణంలో తేమ అంచనా, సముద్రాల మీద
వాతావరణంపై అధ్యయనం చేయనున్నారు. హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం
మీథేన్ లీకులు, భూగర్భ చమురు, పంటలకొచ్చే తెగుళ్లను గుర్తించేందుకు
దోహదపడుతుంది. ప్రయోగం విజయవంతం కావడంపై ఇప్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం
చేశారు.
ఈ మిషన్ లో మొత్తం 9 శాటిలైట్లు నింగికి చేరనున్నాయి. ఇందులో భూ పరిశీలన
ఉపగ్రహం ఈవోఎస్-6 (ఒషియన్ శాట్-6)తో పాటు మరో 8 నానో శాటిలైట్లు ఉన్నాయి.
ముందుగా ప్రధాన శాటిలైట్ అయిన ఓషియన్ శాట్-6ను 742 కిలోమీటర్ల ఎత్తులోని
ఆర్బిట్1లోకి రాకెట్ చేరుస్తుంది. ఆ తర్వాత రాకెట్ కిందకు దిగుతూ 516 నుంచి
528 కిలోమీటర్ల మధ్య ఆర్బిట్2లో మిగతా ప్యాసింజర్ శాటిలైట్లను వేర్వేరుగా
విడిచిపెట్టనుంది. ఇలా వేర్వేరు ఆర్బిట్లలోకి శాటిలైట్లను చేర్చడం కోసం రాకెట్
కు ప్రత్యేకంగా రెండు ఆర్బిట్ చేంజ్ థ్రస్టర్లను అమర్చారు. ఇది పీఎస్ఎల్వీ
రాకెట్ కు 56వ మిషన్ కాగా, పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ వెర్షన్ లో 24వ ప్రయోగం.
ఓషియన్ శాట్-2 స్థానంలో సేవలు అందించేందుకు ఓషియన్ శాట్-6 శాటిలైట్ ను ఇస్రో
పంపుతోంది. ఇది సముద్రపు రంగు, గాలులు, ఇతర అంశాలకు సంబంధించిన డేటాను నిరంతరం
అందించనుంది. మిగతా 8 ఉపగ్రహాల్లో ‘ఇస్రో నానో శాటిలైట్ 2 ఫర్ భూటాన్
(ఐఎన్ఎస్2బీ)’, బెంగళూరుకు చెందిన పిక్సెల్ ఇండియా స్టార్టప్ కంపెనీకి చెందిన
‘ఆనంద్’, హైదరాబాద్ కు చెందిన స్పేస్ స్టార్టప్ ‘ధ్రువ స్పేస్’కు చెందిన రెండు
‘థైబోల్ట్’ నానో శాటిలైట్లు, అమెరికన్ కంపెనీ స్పేస్ ఫ్లైట్ కు చెందిన నాలుగు
‘ఆస్ట్రోక్యాస్ట్’ నానో శాటిలైట్లు ఉన్నాయి.