కృష్ణా నది ఒడ్డున బబ్బూరి గ్రౌండ్స్ లో ఘనంగా ప్రారంభం
విజయవాడ : విజయవాడ నగర వాసులను అలరించడానికి జీవన్ సాగర్ ట్రేడ్ ఫెయిర్ వారి
తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ని సోమవారం రాత్రి 37 వ,డివిజన్ కార్పొరేటర్ మండేపూడి
చటర్జీ చేతులు మీదుగా ప్రారంభించారు. అన్ని వయస్సుల వారిని ఆహ్లాదకరమైన
వాతావరణంలో కృష్ణా నది ఒడ్డున ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ లో ముందుగా ఎర్రకోట
ప్రాకారం ఎంతో ఆకర్షణీయమైన రీతిలో నిర్మించారు. ఎర్రకోట ద్వారం దాటి ముందుకు
వస్తే తాజ్ మహల్ కట్టడం అందరినీ ఆకట్టుకొంటుంది.ఈ ఎగ్జిబిషన్ లో అత్యాధునిక
మ్యూజ్జ్మెంట్స్ కొలంబస్, జెయింట్ వీల్ , బ్రేక్ డ్యాన్స్, ఎంటర్ ప్రైజెస్,
రివాల్వింగ్ టవర్, ఏర్పాటు చేశారు. అలాగే చిన్నారుల కొసం క్యాటర్ పుల్లర్స్,
హెలికాప్టర్, గుర్రాలు, రంగుల రాట్నం, వాటర్ బోటింగ్,జంపింగ్ మేరీ గ్రౌండ్,
ఎయిర్ బౌన్స్ ర్, మినిటోరా టోరా, తదితరాలు ఏర్పాటు చేశారు. వీటితోపాటు హస్త
కళలు, చేనేత వస్త్రాలు. సిమ్లా బజ్జి,స్పెషల్ ఫుడ్ కోర్టు, వినియోగదారుల
అందుబాటులో ఉంటాయని నిర్వహకులు పోతుల కృష్ణ,అచ్చయ్య లు తెలిపారు. ఈ
కార్యక్రమంలో గౌరవ అతిధులు న్యాయవాది బబ్బూరి భూపాల్వై
.యస్.ఆర్.సి.పి.యన్.టి.ఆర్. జిల్లా సీనియర్ నాయకులు కమ్మిలి రత్న కుమార్
తదితరులు పాల్గొన్నారు.