విజయవాడ : తెలుగు సిని పరిశ్రమలో కళాతపస్విగా గుర్తింపు పొందిన దర్శకధీరుడు
డాక్టర్ కే విశ్వనాథ్. ఆయన మరణం యావత్ తెలుగు సిని ప్రియులనే కలచి వేసింది.
ఆయన లేని లేటు తీర్చలేనిదంటూ చిత్ర పరిశ్రమ కన్నీటి పర్యంతమైంది. అంతా గొప్ప
కళాకారుడ్ని విజయవాడలో మరోసారి గుర్తు చేసుకున్నారు. విజయవాడ అభిరుచి సాహితీ
సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో కళాతపస్వి డాక్టర్ కే విశ్వనాథ్ సంస్మరణ సభ
నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్
ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వనాథ్ మరణం సినీ ప్రపంచానికి, తెలుగు ప్రజలకు
తీరని లోటని సంస్థ సభ్యులు అభిప్రాయపడ్డారు. విశ్వనాథ్ చిత్రపటానికి పూల మాల
వేసి నివాళులు అర్పించారు. విశ్వనాథ్ తన చిత్రాల ద్వారా సమాజానికి సందేశం
ఇచ్చేవారని తెలిపారు.”ఆయన తెలుగు కళల్ని ఆయన ఒక రకంగా బతికించారు. ఆయన ప్రతి సినిమా కళఖండమే.
సప్తపది, తరంమారింది లాంటి సినిమాలలో సంస్కరణలు, కులాల మధ్య వ్యత్యాసం
ఉండకూడదని, కులాలు పోవాలని ఆయన సినిమాల ద్వారా చూపించారు. ఆయనలో సంస్కరణ
దృక్పథం ఉండేది. సంప్రదాయాలను నిలబెడుతునే సంస్కరణలు తీసకువచ్చేందుకు కృషి
చేసిన వ్యక్తి విశ్వనాథ్ అని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు.
“తెలుగు సినీ పరిశ్రమలో విశ్వనాథ్ అస్తమయంతో ఒక శకం ముగిసింది. విశ్వనాథ్ ఒక
దర్శక రుషి. ఒక మంచి మనిషి. వారి జ్ఞాపకాలు చిరకాలం ఉంటాయని అభిరుచి సాహితీ
సాంస్కృతిక సంస్థ గౌరవాధ్యక్షుడు ఎం.సి.దాసు పేర్కొన్నారు.