సీఎం
నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి
సంజీవయ్య కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్
విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విజయవాడలో
పర్యటించనున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో
నిర్వహించనున్న జయహో బీసీ మహాసభ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం నెల్లూరు
రూరల్ మండలం కనపర్తిపాడు వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో సూళ్ళూరుపేట ఎమ్మెల్యే
కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
పాల్గొననున్నారు. ఉదయం 11.50 – మధ్యాహ్నం 1.00 గంట వరకు విజయవాడ ఇందిరాగాంధీ
మున్సిపల్ స్టేడియంలో జరగనున్న జయహో బీసీ మహాసభకు హాజరుకానున్న సీఎం, తర్వాత
2.00 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 3.25 గంటలకు నెల్లూరు
రూరల్ మండలం కనపర్తిపాడు చేరుకుంటారు. 3.55 – 4.10 వీపీఆర్ కన్వెన్షన్
హాల్లో సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ వేడుకల్లో
పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 6.20 గంటలకు తాడేపల్లి
నివాసానికి చేరుకుంటారు.
ట్రాఫిక్ ఆంక్షలు: నగరంలో జయహో బీసీ మహాసభ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో
ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్
టి.కె.రాణా తెలిపారు. నగరంలో వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా ఈ చర్యలు
తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం మూడు గంటల
వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. బెంజిసర్కిల్ నుంచి బందరు
రోడ్డులోకి, పోలీస్ కంట్రోల్ రూం నుంచి బెంజిసర్కిల్ వైపు, ఐదో నంబర్
రూట్, ఏలూరు రోడ్డులోని సీతారామపురం సిగ్నల్ నుంచి ఆర్టీఏ జంక్షన్ వరకు,
శిఖామణి సెంటర్ నుంచి బందరు రోడ్డుకు జయహో బీసీ మహా సభకు వచ్చే వాహనాలను
మాత్రమే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.