విజయవాడ : వెనకబడిన కులాలే వెన్నెముక నినాదంతో అధికార వైసీపీ చేపట్టిన జయహో
బీసీ మహా సభ విజయవాడలో ప్రారంభమైంది. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ఈ
సభకు రాష్ట్రం నలుమూలల నుంచి బీసీలు తరలి వచ్చారు. బీసీ నేతలంతా కలిసి జ్యోతి
ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి
ప్రారంభోపన్యాసం చేస్తూ ముఖ్యమంత్రి జగన్ బీసీల స్థితిగతులను మార్చారని
కొనియాడారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50
శాతం రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. జగన్ బడుగు బలహీన వర్గాల పక్షపాతి
అని ప్రశంసలు కురిపించారు.