విజయవాడ పశ్చిమ : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కే కామరాజర్ శిలా విగ్రహాన్ని
విజయవాడ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయాలని గాంధీ దేశం సోషల్ వేల్ఫర్ ట్రీస్
వ్యవస్థాపకులు, నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ కేంద్ర ప్రభుత్వం కి
విజ్ఞప్తి చేశారు. స్వతంత్ర సమరయోధులు,కింగ్ మేకర్ దివంగత కామరాజర్ 121వ
జయంతి వేడుకలు శనివారం 43 వ,డివిజనులో గాంధీ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ
సందర్భంగా నేటి గాంధీ మాట్లాడుతూ 9 సంవత్సరాలు తమిళనాడు సి ఎమ్ గా చేసి
పదవిలో వుండగానే ఆ పదవికి రాజీనామా చేసి యువత కి అవకాశం ఇవ్వాలని చెప్పిన
ఘనుడు కామరాజర్ అన్నారు. అలాగే పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం పధకం ప్రవేశ
పెట్టిన,అలాగే మద్యపానం నిషేధం విధించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కామరాజర్ అని
గుర్తు చేశారు. మొదట నేను తమిలియన్ ని, అంతకంటే భారతీయుడ్ని అని
చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని బెజవాడ రైల్వే స్టేషన్లలో ప్రకటించి భారత
జాతి ఔన్నత్యాన్ని చాటి చెప్పింది బెజవాడ లోనే కనుక ఆయన శిలా విగ్రహాన్ని
ఏర్పాటు చేయాలని కోరుతున్నానని ఆయన తెలిపారు. ఆనాడు నాటి ప్రధాని జవహర్ లాల్
నెహ్రూ కి ఎన్నో కీలకమైన విషయాల్లో సలహాలు సూచనలు ఇచ్చిన ఘనుడు కామరాజర్ అని
ఆనాడు కింగ్ మేకర్ పిలిపించుకొన్న ఆయన భారత దేశం తొలిసారిగా మహిళా ప్రధాని గా
ఇందిరా గాంధీ పదవీ బాధ్యతలు చేపట్టడాని కూడా కామరాజర్ సలహా ఉందని ,
స్వాతంత్ర్య పోరాటంలో తొమ్మిదేళ్లు జైలులో ఉన్న ఆయనకు కేంద్రం సముచిత స్థానం
కల్పించాలని నేటి గాంధీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ఆం
ధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు బంగారు భారతి, ట్రస్ట్అ ధ్యక్షురాలు ఆర్ ఎన్
శివరంజని,బాల బాలికలు తదితరులు పాల్గొన్నారు.