ఆకర్షిస్తోంది.విజయ్ దేవరకొండతో తాను నటించిన ఓ చిత్రాన్ని ఉద్దేశిస్తూ నటి
రష్మిక ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఆ సినిమా తన మనసుకి ఎంతో దగ్గరైందని
చెప్పారు. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే..?
విజయ్ దేవరకొండ – రష్మిక కలిసి నటించిన చిత్రాల్లో ‘డియర్ కామ్రేడ్ ఒకటి. ఫీల్
గుడ్ ప్రేమకథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహించారు.
2019లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలకే
పరిమితమైనప్పటికీ..విజయ్-రష్మికల జోడీ ఆకట్టుకుంది. నేటితో ఈ సినిమా విడుదలై
నాలుగేళ్లు అవుతున్న సందర్భంగా రష్మిక ‘డియర్ కామ్రేడ్’ను ఉద్దేశిస్తూ పోస్ట్
పెట్టారు. విజయ్, దర్శకుడు భరత్ దిగిన ఓ ఫొటోని షేర్ చేసిన ఆమె.. “నా హృదయంలో
ఈ సినిమాకు ఎప్పటికీ ఒక ప్రత్యేకస్థానం ఉంటుంది. ‘డియర్ కామ్రేడ్ కి
నాలుగేళ్లు. థ్యాంక్యూ విజయ్, భరత్” అని రాసుకొచ్చింది
దీనికి, ఆమె.. ఓ ఎమోజీని కూడా జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెటిజన్ల
దృష్టిని ఆకర్షిస్తోంది.