హైదరాబాద్ : పోలీస్ సంస్మరణ దినం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన పోలీస్ సిబ్బందికి డిజిపి రవిగుప్త నగదు బహుమతులను అందజేశారు. రాష్ట్ర డిజిపి కార్యాలయంలో గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ బహుమతులను ఇచ్చారు. పోలీసు సంక్షేమ విభాగపు ఐ జి పి స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్న సమావేశంలో డిజిపి మాట్లాడుతూ గత పోలీస్ సంస్మరణ దినం సందర్భంగా జరిగిన వ్యాసరచన పోటీలు రెండు విభాగాలలో జరిగాయని తెలియజేశారు ఏఎస్ఐ , ఏఅర్ఎస్ఐ లు, వారి కింది స్థాయి సిబ్బందిమొదటి క్యాటగిరి గాను, ఎస్సై , ఆర్ఎస్ఐ లు, వారి పై స్థాయి సిబ్బంది రెండవ కేటగిరీగాను పరిగణించి నిర్వహించిన పోటీలలో 12 మందిని విజేతలుగా నిర్ణయించామని వెల్లడించారు. ప్రథమ బహుమతిగా 20వేల రూపాయలు నగదును ద్వితీయ తృతీయ బహుమతులకు 15 వేలు , 10వేలు గా అందజేయాలని నిర్ణయించామన్నారు. విజేతలకు ఈ సందర్భంగా డి జి పి అభినందనలు తెలియజేశారు. ఈ రకమైన పోటీలలో పాల్గొనడం ద్వారా పోలీస్ సిబ్బంది తమ ప్రతిభను ప్రదర్శించవచ్చన్నారు. ఈ పోటీలోనే కాక భవిష్యత్తులో మరిన్ని పోటీలలో పోలీస్ సిబ్బంది పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు.