మార్చడంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని అందంగా
మార్చుతాయి. విటమిన్ ఇ నీ ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు ఏమిటంటే..
యూవీ కిరణాలు నుంచి:
విటమిన్-ఇ కంటెంట్ ఉన్న ఆహారపదార్ధాలు తినడంతో చర్మం మెరుస్తుంది. ఇందులో ఉన్న
యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షణను అందిస్తాయి.
ఫ్రీ రాడికల్స్ మాయం:
దాదాపు చర్మ సమస్యలు ఫ్రీ రాడికల్స్ కారణంగా వస్తాయి. విటమిన్ ఇ లో ఉన్న యాంటీ
ఆక్సిడెంట్లు కాలుష్యం కారణంగా వచ్చే ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తాయి. దీంతో
ముడతలు రావు.
ఆక్సిడేటివ్ స్ట్రెస్:
విటమిన్ ఇ కంటెంట్ ఉన్న ఆహారాలు తినడంతో కణాలు ఆరోగ్యంగా మారుతాయి. ముఖ్యంగా
ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తొలగిస్తుంది. దీంతో మెరిసే చర్మాన్ని పొందవచ్చు.
మాయిశ్చరైజ్:
విటమిన్ ఇ లో తేమ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి.
పొడి చర్మం సమస్యతో బాధపడేవారికి విటమిన్ ఇ సరైన పరిష్కారం. విటమిన్ ఇ సీరమ్
రాసుకోవచ్చు.
గాయాలు మానుతాయి:
విటమిన్ ఇ చర్మాన్ని ఆరోగ్యంగా మార్చుతుంది. ఇందులో ఉన్న పోషకాలు చర్మాన్ని
నయం చేస్తాయి. విటమిన్ ఇ గాయాలు త్వరగా మానేలా చేస్తుంది.
మచ్చలు మాయం:
మచ్చలను తొలగించడంలో విటమిన్ ఇ సహాయపడుతుంది. విటమిన్ ఈ కణాలు ఆరోగ్యంగా,
అందంగా మార్చుతుంది. దీంతో నల్ల మచ్చలు తొలగుతాయి.
అలెర్జీలు దూరం:
విటమిన్ ఇ అలెర్జీలను దూరం చేయడంలో సహాయపడుతుంది. విటమిన్ ఇ ఉన్న పదార్థాలు
తినడంతో చర్మంపై దద్దుర్లు, దురదలను
తొలుగుతాయి.
విటమిన్ ఈ కోసం సన్ ఫ్లవర్ ఆయిల్, సోయా బీన్ ఆయిల్, సన్ ఫ్లవర్ సీడ్స్, బాదం,
పీనట్స్, పాలకూర తినడం ఉత్తమం.