ముఖ్యంగా బీ-కాంప్లెక్స్(నియాసిన్)విటమిన్లు తీసుకోవడంతో ఆరోగ్యం
మెరుగుపడుతుంది. విటమిన్ బి-3ను తీసుకోవడంతో కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం..
గుండె ఆరోగ్యం:
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో విటమిన్ బి-3 సహాయపడుతుంది. బి-3 రక్తంలో
చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో గుండెపోటు వచ్చే
ప్రమాదం తగ్గుతుంది.
మెరిసే చర్మం:
అవసరమైన మెతాదుతో విటమిన్ బి3 తీసుకోవడంతో చర్మంలో నీటి శాతం పెరుగుతుంది.
దీంతో నిత్యం హైడ్రేట్ గా ఉండవచ్చు. మొటిమలతో బాధపడుతున్న వారు నియాసిన్
తీసుకోవడం ఉత్తమం.
మెదడు అరోగ్యం:
విటమిన్ బి3 ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవడంతో మెదడు చురుకుగా పని చేస్తుంది.
పెద్దవారిలో అల్జీమర్స్ నుంచి రక్షణను అందిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధిని
నివారించడంలో సహాయపడుతుంది.
డయాబెటిస్:
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో నియాసిన్ సహాయపడుతుంది. డయాబెటిస్తో
బాధపడుతున్న వారిలో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ కణాలు
దెబ్బతింటాయి. దీని నుంచి నియాసిన్ రక్షిస్తుంది.
ఆర్థరైటిస్:
ఆర్థరైటిస్ నొప్పిని, వాపును నియంత్రించడంలో నియాసిన్ ఉపయోగపడుతుంది.
నియాసినామైడ్ వాపును కంట్రోల్ చేస్తుంది.
పెల్లాగ్రా:
నియాసిన్ లోపం కారణంగా పెల్లాగ్రా వస్తుంది. నియాసిన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న
పదార్థాలు తినడంతో పెల్లాగ్రా తగ్గుతుంది.
లైంగిక ఆరోగ్యం:
నియాసిన్ కంటెంట్ ఉన్న పదార్థాలు తినడంతో పురుషుల్లో లైంగిక సామర్ధ్యం
పెరుగుతుంది. అంగస్తంభన సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది. నపుంసకత్వంను
తొలగిస్తుంది.
నిద్ర లేమి:
నియాసిన్ ఉన్న ఆహారాలను తీసుకోవడంతో నిద్ర లేమి సమస్యలు దూరం అవుతాయి.
నియాసిన్న తీసుకోవడంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.