కంటి ఆరోగ్యాన్ని కాపాడటానికి, హీమోగ్లోబిన్ స్థాయిలను తగ్గించి రక్తహీనతకు
చెక్ పెట్టడానికి విటమిన్ బి6 చాలా అవసరం. మరి ఇలాంటి విటమిన్ బి6 ఎక్కువగా
లభించే ఆహారాలేంటో చూద్దామా..
1.పాలకూర:
పాలకూరలో విటమిన్ బి6 ఎక్కువగా ఉంటుంది. ఈ ఆకుకూరను తినడం ద్వారా రోగనిరోధక
శక్తి పెరగడంతో పాటు హైడ్రేట్ గా ఉండొచ్చు. అలాగే కంటి ఆరోగ్యాన్ని
కాపాడుకోవచ్చు.
2.చేపలు:
మాంసాహారులకు విటమిన్ బి6 ఎక్కువగా లభించే ఆహారంగా చేపలను చెప్పవచ్చు. వీటిని
తినడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా ఆస్తమా తగ్గించుకోవచ్చు.
3.బంగాళదుంపలు:
బంగాళదుంపల్లోనూ విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. వీటిని తినడం ద్వారా జీర్ణక్రియ
మెరుగుపడటంతో పాటు ఆరోగ్యంగా ఉండొచ్చు.
4.కోడిగుడ్లు:
కోడిగుడ్లలో ప్రోటీన్స్, కొవ్వులు, విటమిన్ డి, ఫోలేట్, ఒమెగా-3 ఫ్యాటీ
యాసిడ్స్, సెలీనియంతో పాటు విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. అందుకే ఎగ్స్ సూపర్
ఫుడ్ గా చెప్తారు.
5.అవకాడో:
అనేక పోషకాలు, మంచి కొవ్వులు కలిగిన పండు అవకాడో. ఈ పండ్లలో పొటాషియంతో పాటు
విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఇవి ఆర్థరైటిస్ ను నివారించడంతో పాట గుండె
ఆరోగ్యాన్ని కాపాడతాయి.
6.మాంసం:
ఉడికించిన మాంసంలోనూ విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. అలాగే వీటిలో ప్రోటీన్స్
కూడా ఎక్కువే. అయితే ఈ మాంసాన్ని మితంగా తీసుకోవడం మంచిది.
7.అరటి:
అరటి పండ్లలోనూ విటమిన్ బి6 ఉంటుంది. ఇవి జీర్ణక్రియకు తోడ్పడటంతో పాటు
మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
8.పాలు:
ఆవు, మేక పాలలో శరీరానికి కావాల్సిన విటమిన్ బి6 లభిస్తుంది. ఈ పాలు తాగడం
వల్ల మెదడు పనితీరు మెరుగుపడటంతో పాటు నాడీ వ్యవస్థలోని సమస్యలు తగ్గుతాయి.