బీజింగ్ : చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత నెల రోజులుగా
కనిపించకుండా పోయిన చిన్గాంగ్ను విదేశాంగశాఖ మంత్రి పదవి నుంచి తప్పించింది.
ఆయన స్థానంలో వాంగ్ యీని నియమించింది. చైనా విదేశాంగ శాఖ మంత్రిని
తొలగించినట్లు అక్కడి అధికార మీడియా జిన్హువా వెల్లడించింది. ప్రభుత్వ
నిర్ణయానికి అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా ఆమోదముద్ర వేసినట్లు పేర్కొంది. అయితే,
తొలగింపునకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. చిన్‌గాంగ్ గత నెల రోజులుగా
కనిపించకపోవడం చైనాతోపాటు అంతర్జాతీయంగానూ చర్చనీయాంశమైంది. అనారోగ్యం అంటూ
చెబుతున్నా అమెరికా పౌరసత్వమున్న చైనా జర్నలిస్టుతో వివాహేతర సంబంధమే ఆయన
మాయమవటానికి కారణమని కొందరు చెబుతున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు
చిన్‌గాంగ్ అత్యంత సన్నిహితుడు. ఆయన అండతోనే ఇటీవలి కాలంలో చైనా విదేశాంగ
విధానంలో అత్యంత బలీయమైన నేతగా ఎదిగారాయన. చిన్‌గాంగ్ 1988లో చైనా
విదేశాంగశాఖలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగారు. రెండుదఫాలు చైనా విదేశాంగ అధికార
ప్రతినిధిగా వ్యవహరించారు. జిన్‌పింగ్ అధ్యక్షుడయ్యాక చకచకా కీలక స్థానాల్లోకి
ఎదిగారు. 2021లో స్వల్పకాలంపాటు అమెరికా రాయబారిగా నియమితుడై… 2022లో
అనేకమంది సీనియర్లను కాదని విదేశాంగశాఖ మంత్రిగా పదోన్నతి పొందారు.
పాశ్చాత్యదేశాల్లో చైనా పట్ల ఉన్న వ్యతిరేకతను బలంగా తిప్పికొట్టిన నేతగా
పేరుంది. ఎదురుదాడిలో దిట్ట. ఇంగ్లిష్ బాగా మాట్లాడతారు. జూన్ 25న చివరిసారిగా
రష్యా ఉప విదేశాంగమంత్రి ఆండ్రీ రుడెంకోతో భేటీలో ఆయన కనిపించారు. ఆ తర్వాత
అనేక కీలక సమావేశాలు ఆయన లేకుండానే సాగిపోతున్నాయి. లేదా వాయిదా పడుతున్నాయి.
ఆసియాన్ కూటమి సమావేశం ఆయన లేకుండానే ముగిసింది. యూకే విదేశాంగ మంత్రి బీజింగ్
పర్యటన, యూరోపియన్ యూనియన్ అధికారుల పర్యటన వాయిదా పడ్డాయి. అమెరికా ఆర్థిక
మంత్రి, పర్యావరణ మంత్రుల బీజింగ్ పర్యటనలు చిన్‌గాంగ్ లేకుండానే ముగిశాయి.