హైదరాబాద్: అమెరికా సహా ఇతర దేశాల్లో నివసిస్తోన్న తెలంగాణ విద్యార్థులు, యువత కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. చికాగోలో హైదరాబాద్ విద్యార్థి సయ్యద్ మజాహిర్‌పై దాడి, ఒహియోలో శ్రేయాస్‌రెడ్డి హత్య కలవర పెడుతున్నాయని సీఎం ట్వీట్ చేశారు. తమ ఆందోళనను అమెరికాకు తెలపాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌ను కోరారు. తెలంగాణ ప్రజలు ఈ భూమిపై ఎక్కడ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. అమెరికా లో ఉన్నత విద్య కోసం వెళ్లిన హైదరాబాద్ విద్యార్థి సయ్యద్ మజాహిర్ అలీపై దాడి జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి అతడు హోటల్ నుంచి ఇంటికెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. తల, ముక్కు, కళ్లపై గాయాలయ్యాయి. తనపై జరిగిన దాడిని వీడియో ద్వారా వెల్లడించాడు. తనకు సాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని, అగ్రరాజ్యంలోని మన దౌత్య సిబ్బందిని అభ్యర్థించారు. దీంతో అతడి పరిస్థితిపై హైదరాబాద్‌లో ఉంటున్న కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తన భర్తకు సాయం చేయాలంటూ అలీ భార్య ఫాతిమా రిజ్వి జైశంకర్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీఎం స్పందించారు