బాలాయపల్లి :-
పదవ తరగతి విద్యార్థులకు అండగా ఉంటు పూర్తి సహకారాలు అందిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ వెందోటి కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు సందర్భంగా మండలంలో ని వెంగమాంబ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన సామాగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేదురమల్లి కుటుంబం కోసం తాము శక్తివంచన లేకుండా చేస్తామన్నారు. అంతేకాకుండా వారి పేరు మీద మండలంలోని అన్ని పాఠశాలలో ఉన్న పదోవ తరగతి విద్యార్థులకు పరీక్షల సామాగ్రిని అందజే స్తామన్నారు. అనంతరం రాష్ట్ర మహిళ అధికార ప్రతినిధి రాయి దేవిక చౌదరి మాట్లాడుతూ తమ వంతు సాయం అందించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాంబాబు నాయుడు, సురేష్, వెంకటకృష్ణమనాయుడు, గ్రామ సర్పంచి బాపనపల్లి వెంకటసుబ్బయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫోటో:- విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేస్తున్న దృశ్యం