డక్కిలి : వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్
మండలంలోని వీకేవై సముద్రం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వివిధ క్రీడా, వ్యాసరచన సాంస్కృతిక పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గ్రామ సర్పంచ్ దాసరి పోలయ్య బహుమతులను అందజేశారు, ముందుగా జాతీయ జెండాని ఎగరేసి దేశభక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ఎస్ మల్లేశ్వరి, ప్రధానోపాధ్యాయులు రతిదేవి సహచర ఉపాధ్యాయుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.