బాలాయపల్లి -(వెంకటగిరి ఎక్స్ ప్రెస్) :-
గూడూరు రూరల్ మండలం గొల్లపల్లి గ్రామములో ఉన్న వెందోటి సౌజన్య రెడ్డి ఇంగ్లీష్ మీడియం పాఠ శాలలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా గురు వారం విద్యార్థులకు రంగవల్లి పోటీలు ఆ పాఠశాల కరస్పాండెంట్ దానం జయలక్ష్మి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు పోటీ తత్వం ఉంటేనే ఉన్నత స్థానంకి చేరుకుం టారని తెలిపారు. విద్యార్థులకు పూర్తి సహకారం అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉందని కోరారు. ఉపాధ్యాయులు విద్యార్థులను పోటితత్వంలో పాల్గొన్నందుకు అవగాహన కల్పించి వారిని ప్రతి పోటీల్లో పాల్గొనేలా ప్రత్యేక మైన చర్యలు చేపటాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. రంగవల్లి పోటీలో విజయం సాధించిన వారికి ప్రత్యేక బహుమతులు ఇవ్వడం జరుగు తుందన్నారు.ఇక రంగవల్లి పోటీలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి జ్యోతి, నోసిన మధురవాణి, సద్దుకూటి గౌతమి, నర్రెడ్ల మంజుల, నర్రావూల చెంచమ్మ, దానం మానస స్పందన, పాఠశాల ప్రిన్సిపాల్ దానం సురేంద్రబాబు. తదితరులు పాల్గొన్నారు.
ఫోటో :- రంగవల్లి వేస్తున్న విద్యార్థులు