హనుమకొండ : విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో అనుకున్న లక్ష్యాలను సాధించాలని,
అందుకు పట్టుదలతో చదవాలని గవర్నర్ తమిళిసై సూచించారు. వరంగల్ జాతీయ సాంకేతిక
విద్యాసంస్థ(నిట్)లో ఈ నెల 5 నుంచి నిర్వహిస్తున్న ‘ఇంప్రూవింగ్ లాజిక్
బిల్డింగ్ స్కిల్స్ ఆఫ్ ఆదివాసీ, షెడ్యూల్డ్ ట్రైబ్స్’ శిక్షణ కార్యక్రమం
ముగిసింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ నిధులు మంజూరు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 80 మంది ఆదివాసీ విద్యార్థులను నిట్ క్యాంపస్‌కు తీసుకొచ్చి
యోగా, కోడింగ్, రోబోటిక్స్, చిత్రలేఖనం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు.
ముగింపు రోజు రాజ్‌భవన్ నుంచి గవర్నర్ వర్చువల్‌గా విద్యార్థులతో
మాట్లాడారు. శిక్షణ గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. బీటెక్ విద్యార్థుల
కన్నా బాగా మాట్లాడుతున్నారంటూ ప్రశంసించారు. విద్యార్థులను రాజ్‌భవన్‌కు
ఆహ్వానించారు. కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల సంస్థ డిప్యూటీ
సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి, నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి,
విభాగాధిపతి శ్రీహరి, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.