తిరుపతి : భారతదేశ ఉన్నత విద్యా వ్యవస్థ ప్రపంచంలో రెండవ అతి పెద్దదిగా ఉందని అత్యాధునిక పరిజ్ఞానం, అత్యంత నైపుణ్యం కలిగిన మానవ శక్తిని అందించడం మన లక్ష్యం కావాలని శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయ కులపతి, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. శుక్రవారం మద్యాహ్నం శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ 19, 20వ స్నాతకోత్సవం మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. గవర్నర్ మాట్లాడుతూ కాలానుగుణoగా ఉన్నత విద్యాసంస్థలు మెరుగైన విద్యా, విజ్ఞానాన్ని అందించడానికి కృషి చేయాలన్నారు.
పరిశోదనలు నిరంతరం జరగాలని అప్పుడే ఉన్నత విద్య సమర్థవంతంగా రాణించగలుగుతుందని అన్నారు. ఉమ్మడి బోధన, వర్చువల్ లర్నింగ్, ఉపన్యాసాలు ద్వారా ప్రపంచవ్యాప్తంగా విద్యా సంస్థలు విజ్ఞానాన్ని పంచుకోవాలని, అద్యాపకులు కొత్త పద్దతులలో భోదనలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహిళా విద్యార్థులకు దేశ నిర్మాణ కర్తలుగా శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో స్థాపించిన ఈ విశ్వ విద్యాలయం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఎన్.ఈ.పి. – 2020 విద్యార్థులలో సామర్థ్యాన్ని మెరుగు పరచడానికి, వంద శాతం బాలికలు పాఠశాలల్లో నమోదుకు అవకాశం కల్పిస్తుందన్నారు విశ్వవిద్యాలయం భారతీయ ఉన్నత విద్యా సంస్థలలో 24 వ స్థానంలో నిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు.
ఇప్పటికే ఈ విశ్వవిద్యాలయం నుండి 6 వేలకు మందికి పైగా విద్యను అభ్యసించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థాయిలలో ఉండటం గర్వకారణంగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు అన్నారు. ఉన్నత విద్యను అభ్యసించి బాహ్య ప్రపంచంలోకి వెళుతున్న మీరు దేశ సేవలో స్వాతంత్ర్య సమర యోధుల స్ఫూర్తితో భాగస్వాములు కావాలని కోరుతున్నానని అన్నారు. గౌరవ డాక్టరేట్ అందుకున్న డా.పద్మాజా రెడ్డి మాట్లాడుతూ తన స్వస్థలం కూచిపూడి గ్రామమని, 6 సంవత్సరాల వయస్సు లోనే కూచిపూడి నేర్చుకుని 50 సంవత్సరాలుగా వంద దేశాలలో 3000 కార్యక్రమాలు చేపట్టానని, ప్రణవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ సంస్థ ద్వారా వేలాదిమందికి నాట్యంలో శిక్షణ అందించానని నేడు గౌ.డాక్టరేట్ అందుకోవడం గర్వకారణంగా ఉందని అన్నారు. ఉప కులపతి డి.జమున మాట్లాడుతూ శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం దేశంలోనే ఆదర్శంగా విద్యా భోదన, పరిశోదనలు నిర్వహిస్తుందన్నారు.
వివిధ యూనివర్సిటీలు, విద్యా సంస్థలతో బాగస్వాములై విద్య, విజ్ఞానంలో పురోగతిలో ఉన్నామని 27 విభాగాలతో 34 యు.జి., పి.జి. కోర్సులు నిర్వహిస్తున్నామని వివరించారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తదితరులు పాల్గొన్నారు. పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం దేశంలోనే ఆదర్శంగా విద్యా భోదన, పరిశోదనలు నిర్వహిస్తుందన్నారు. వివిధ యూనివర్సిటీలు, విద్యా సంస్థలతో బాగస్వాములై విద్య, విజ్ఞానంలో పురోగతిలో ఉన్నామని 27 విభాగాలతో 34 యు.జి., పి.జి. కోర్సులు నిర్వహిస్తున్నామని వివరించారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తదితరులు పాల్గొన్నారు.