శ్రీనివాసరావువిజయవాడ : విద్యా రంగానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని నవ్యాంధ్ర
టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కరణం హరికృష్ణ , శ్రీనివాసరావు
కోరారు. విజయవాడ పడమట సమగ్ర శిక్షలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
ఏర్పాటుచేసిన ఉపాధ్యాయ సంఘాల కోఆర్డినేషన్ సమావేశంలో ఎన్ టి ఏ రాష్ట్ర
అధ్యక్ష, కార్యదర్శులు కరణం హరికృష్ణ , శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యా
రంగంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయ
తలపెట్టీన మండలానికి ఒక మహిళా కళాశాల, ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు ప్రతిపాదనను
పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. ఇందు నిమిత్తం కళాశాలకు అవసరమయ్యే
అధ్యాపకులను, ఇతర సిబ్బందిని నియమించాలని వివరించారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు
కల్పించడం ద్వారా వారికి జూనియర్ లెక్చరర్ హోదాను కల్పించి ఈ కళాశాలల్లో బోధన
కొనసాగించాలని కోరారు. బదిలీలకు శాశ్వత కోడ్ ను రూపొందించి ప్రతి ఏడాది వేసవి
సెలవుల్లోనే బదిలీలు పూర్తయ్యేలాగా చర్యలు తీసుకోవాలన్నారు.
రేషనలైజేషన్ కు సంబంధించి అసంబద్ధంగా ఉన్న జీవో నెంబర్ 117, 128 రమ రద్దుచేసి
కొత్త ఉత్తర్వులు ఇవ్వాలని విశదీకరించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం
ఉపాధ్యాయుల నియామకం జరగాలని, ఇందుకు అనుగుణంగా ఒకటి నుంచి ఐదు తరగతులు ఉన్న
ప్రాథమిక పాఠశాలలో ఒక తరగతిలో 30 మంది విద్యార్థులు కంటే ఎక్కువగా ఉంటే రెండో
సెక్షన్ ను ఏర్పాటు చేయాలన్నారు. 6 నుంచి 8 తరగతిలో తరగతికి 35 మంది
విద్యార్థులకు ఉంటే అదనపు సెక్షన్ ను 9 మరియు 10వ తరగతిలో 40 మంది
విద్యార్థులు దాటితే అదనపు సెక్షను ఏర్పాటు చేసి స్టాప్ ఫ్యాటర్ను ఏర్పాటు
చేయాలని విశ్లేషించారు. ఉపాధ్యాయులకు పని భారంపై విద్యాహక్కు చట్టానికి లోబడి
వారానికి 32 బోధనా పిరియడ్లు ఉండేలా మార్పులు చేయాలన్నారు. ఒకటి నుంచి ఐదు
తరగతి లకు తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా మార్పులు చేయాలి. ప్రాథమికోన్నత
పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తరగతికి ఒక ఉపాధ్యాయుడు 6 నుంచి 8
తరగతులకు సబ్జెక్టు ఉపాధ్యాయులు అందరూ ఉండేలా చూడాలన్నారు.