పార్వతీపురం : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థకు అధిక
ప్రాధాన్యత ఇస్తూ అనేక పధకాల అమలు చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న
దొర తెలిపారు. బుధవారం మక్కువలో నిర్వహించిన 4వ విడత అమ్మఒడి ఉత్సవ
కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మరియు
గిరిజన సంక్షేమశాఖామంత్రి పీడికరాజన్న దొర మాట్లాడుతూ ఈ నెల 28న అమ్మఒడి
నాలుగవ విడత ఆర్థిక సహాయ కార్యక్రమంను ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి
జిల్లానుండి ప్రారంభించి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో దాదాపు రూ.6,500 కోట్లను
జమచేయుటకు బటన్ నొక్కారని, పండుగ వాతావరణంలో పదిరోజులలో జిల్లాలో 86,409
మంది తల్లుల ఖాతాల్లో రూ.139.61 కోట్లు జమ అవుతున్నాయని తెలిపారు. నాణ్యమైన
విద్యను అందించుటకు ప్రభుత్వం విద్యా సంవత్సరం ఆరంభంలోనే విద్యార్థులకు జగనన్న
కిట్లు, ఇతర అవసరమైన వస్తువులు దాదాపుగా పంపిణి చేసిందని, ప్రభుత్వం అందించిన
ప్రోత్సాహం, సహాయ సహకారాలతో, అధికారులు, ఉపాద్యాయుల కృషితో పదవ తరగతి
పరీక్షలలో 87.40 శాతం సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలించిందని
తెలిపారు. ఒకప్పుడు చదువుల్లో కేరళ మొదటి స్థానంలో ఉండేదని, ప్రస్తుతం
ఆంద్రప్రదేశ్ ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మొదటి స్థానంలో నిలబెట్టారని
ఆయన అన్నారు. విద్యార్థులను ప్రోత్సహించుటకు మంచి మార్కులు సాధించిన
విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు పధకం ద్వారా బహుమతులు అందించి
ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల అధికారులు, ఉపాద్యాయులు,
విద్యార్థులు పాల్గొన్నారు.