అమరావతి : పబ్లిక్ పాలసీలను ప్రజలకు చేరువ చేసే స్వచ్చంద సంస్థ అయిన ఇండస్
యాక్షన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పాలసీ, గవర్నెన్స్, టెక్నాలజీ,
కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ పరంగా మద్దతును అందిస్తుంది. రైట్ టు ఎడ్యుకేషన్
(ఆర్టిఈ) – విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 12(1)(సి) కింద అడ్మిషన్లను
సులభతరం చేసేందుకు ఆన్లైన్ పోర్టల్‌ను ప్రారంభించినట్లు 2023 ఫిబ్రవరి 26 న
ఆంధ్రప్రదేశ్ (ఎపి) ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి
వెల్లడించారు. ఇటీవల ఈ ప్రభుత్వ ఉత్తర్వు రాష్ట్రంలోని
ఐబి/ఐసిఎస్ఈ/సిబిఎస్ఈ/స్టేట్ సిలబస్ పాఠశాలలతో సహా అన్ని ప్రైవేటు
అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో 25శాతం సీట్ల కేటాయింపును తప్పనిసరి
చేసింది. దాని కింద అడ్మిషన్లు మార్చి 22 నుండి నుండి ఈ విద్యా సంవత్సరానికి
ప్రారంభమయ్యాయి.
రాష్ట్రంలోని పిల్లలందరికీ వారి సామాజిక, ఆర్థిక నేపథ్యాలతో సంబంధం లేకుండా
సామాజికంగా సమ్మిళితమైన విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ చట్టం ప్రారంభమైంది.
ఈ విద్యా విధానాన్ని అమలు చేయడం సవాలుతో కూడుకున్నది. అయితే పరిపాలనా భారాన్ని
తగ్గించడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా కీలక సమస్యలను
పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నది. ఆర్టిఈ సెక్షన్
12(1)(సి) కింద అడ్మిషన్లు 2022-23 విద్యా సంవత్సరం నుండి ఎపిలో
ప్రారంభమైంది. వాటి అమలు అనేది ఇప్పుడు రెండవ సంవత్సరంకు చేరుకున్నది.
‘‘ప్రస్తుతం 2023-24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ ప్రక్రియ మొదలైంది.’’ ఇతర
సంక్షేమ కార్యక్రమాలకు అంతరాయం లేకుండా ఆర్టిఈ సెక్షన్ 12(1)(సి)
అడ్మిషన్లను ఆన్లైన్లో ప్రారంభించడం, టెక్నాలజీని నేర్పుగా ఉపయోగించడంలో
ప్రభుత్వం యొక్క ట్రాక్ రికార్డ్‌కు అనుగుణంగా ఉంది. ఇండస్ యాక్షన్‌కు 19
ఇతర రాష్ట్రాల్లో ఆఫ్‌లైన్ మరియు ఆన్లైన్ ఫార్మాట్లలో సెక్షన్
12(1)(సి) ను అమలు చేసిన అనుభవం ఉంది.
ఇండస్ యాక్షన్, లాయర్ మరియు పబ్లిక్ పార్టనర్షిప్ డైరక్టర్ రా శివ
మాట్లాడుతూ ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఈ చట్టం ప్రారంభ దశలో ఉంది. ఈ చట్టం అమలు,
భవిష్యత్తులో ఒక సమ సమాజ స్థాపనకు దారి తీస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
దీని అమలుకు ముందుకు రావడం హర్షించదగ్గ పరిణామం.’’ ‘‘ఈ చట్టం ద్వారా
తల్లితండ్రులు వారి సామాజిక ఆర్దిక పరిస్థితులతో సంబంధం లేకుండా, పిల్లలను
వారికి నచ్చిన పాఠశాలలో చేర్చే అవకాశం లభిస్తుంది. ఇది సామాజిక విలీనానికి
గొప్ప పునాది.’’ అని ఇండస్ యాక్షన్, ఆంధ్ర ప్రదేశ్ లీడ్ ఆపరేషన్స్, శివ
కార్తీక్ వలపర్ల అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టిఈ 12(1)(సి) కింద ప్రైవేట్
పాఠశాలల్లో 2023 మార్చి 22 నుండి ఏప్రిల్ 10 వరకు అడ్మిషన్ల కోసం దరఖాస్తులు
స్వీకరించబడతాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా దరఖాస్తులను ఆన్లైన్లో
ఉచితంగా సమర్పించవచ్చు. దరఖాస్తు చేయడానికి, దరఖాస్తుల కోసం అర్హత ప్రమాణాలు
మరియు ఇతర మార్గదర్శకాల గురించి తెలుసుకోవడానికి దయచేసి హెల్ప్‌లైన్ నంబర్
14417, ఇండస్ యాక్షన్ హెల్ప్‌లైన్ నంబర్ – 9502666864 కు కాల్
చేయవచ్చన్నారు.