హైదరాబాద్ : విద్యుత్తు సంస్థల అభివృద్ధికి ఉద్యోగులు, కార్మికులు కష్టపడి
పనిచేయాలని జెన్కో-ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు సూచించారు.
ఉద్యోగుల సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. గత ఏప్రిల్ నుంచి
అమల్లోకి వచ్చిన నూతన వేతన సవరణ ఒప్పందం వివరాలు, దీనిపై జారీచేసిన
ఉత్తర్వులు, జీతభత్యాల పెరుగుదల సమాచారంతో 1104 విద్యుత్తు ఉద్యోగుల సంఘం
రూపొందించిన పుస్తకాన్ని మింట్ కాంపౌండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో
ఆవిష్కరించారు. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి
కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంఘం అధ్యక్షుడు వి.వెంకటేశ్వర్లు అధ్యక్షత
వహించిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి సాయిబాబు మాట్లాడుతూ కార్మికుల
సమస్యలను వివరించి పరిష్కరించాలని సీఎండీలకు విన్నవించారు.