సైదాపురం, జనవరి24,వెంకటగిరి అసెంబ్లీ ఎక్స్ ప్రెస్: ఇంటి నుంచి విధులకు బయలు దేరి వ్యవసాయ భూమి లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద బుధవారం విద్యుత్ షాక్ కు గురై లైన్ మెన్ చెంజీ శ్రీనివాసులు(4౦)ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ చల్లా వాసు కథనం మేరకు సైదాపురం కు చెందిన చెంజీ శ్రీనివాసులు వేములచేడు లో లైన్ మెన్ గా పని చేస్తున్నాడు. ట్రాన్స్ ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి మృత దేహాన్ని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. శ్రీనివాసులు మృతితో కుటుంబ సభ్యులు, రైతులు, సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు.