కడప : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్య, వైద్యా
ఆరోగ్య, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేసి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు
సంక్షేమ పథకాలను అందించడం జరుగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మైనార్టీ
సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి. అంజాద్ భాష, నగర మేయర్ కే సురేష్ బాబు సంయుక్తంగా
అన్నారు. కడప నగరపాలక సంస్థ, ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
పట్టణంలోని రవీంద్ర నగర్ పరిధిలో మోచంపేట, మారుతీ నగర్ పరిధిలో, ఫక్కీరు పల్లె
పరిధిలో నూతనంగా 3 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి. అంజాద్ భాష, నగర మేయర్ కే. సురేష్ బాబు
చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి. అంజాద్ భాష
మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి
విద్యకు వైద్యానికి వ్యవసాయానికి మూడు రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఈ
ప్రభుత్వంలో ప్రతి పేదవానికి ఉన్నతమైన చదువులు చదివించాలనే ఆలోచనలో భాగంగా
విద్యకు పెద్దపీట వేయడం జరిగిందని, తద్వారా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం
కలిగించాలనే ఆలోచనలో భాగంగానే వైద్యా రంగానికి పెద్దపీట వేసిన పరిస్థితిని
చూస్తున్నామని అన్నారు.
కడప పట్టణంలో మోచంపేట, మారుతి నగర్, ఫక్కీర్ పల్లెలో
మూడు ప్రాంతాల్లో 3 అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రారంభోత్సవం చేసుకోవడం ఎంతో
సంతోషకరమైన విషయమని అన్నారు. సదరు ప్రాంతాలలో ఎంతో పేదవారు నివసిస్తున్నారని
వారందరికీ అందుబాటులో అర్బన్ హెల్త్ సెంటర్ ఉంటుందని సదరు పరిసర ప్రాంతాలలో
ఉన్న పేదలందరూ ఈ అర్బన్ హెల్త్ సెంటర్లను వినియోగించుకోవాలని చెప్పారు. ఈ
అర్బన్ హెల్త్ సెంటర్లు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని
అన్నారు. ఇక్కడే ఒక డాక్టరు, 12 మంది సిబ్బంది ఉచితం గా వైద్య సేవలు
అందించి, ఉచితంగా నెలకు సరిపడే మందులు, ఉచితంగా రక్త పరీక్షలు చేయడం
జరుగుతుందని పేదలందరూ హెల్త్ సెంటర్ కు వచ్చి సేవలన్నీ సద్వినియోగం
చేసుకోవాలని తెలిపారు. రాబోవు రోజుల్లో కూడా ఇక్కడ ఉచిత వైద్య ఆరోగ్య
శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అవసరమైన డాక్టర్లను కూడా ఏర్పాటు చేసి ఈ
ప్రాంతంలోని పేద ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని
అన్నారు.
నగర మేయర్ కే సురేష్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
ప్రభుత్వంలో విద్య, వైద్యా ఆరోగ్య, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేసి పేద బడుగు
బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడం జరుగుతోందని అన్నారు. దేశంలో
ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లోనే పేద ప్రజలు
ఆర్థికంగా సామాజికంగా ఉన్నతికి ఎదగాలని ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకెళ్తోందని
చెప్పారు.