జగిత్యాల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఆకస్మిక తనిఖీ
కొందరు బాధ్యులు విధుల్లో లేకపోవడంపై ఆగ్రహం
జగిత్యాల : పేదలకు మెరుగైన వైద్యం అందించాలంటే వైద్యులు సమయపాలన పాటించాలని
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశా రు. డాక్టర్లు ఉదయం 9 నుంచి
సాయంత్రం 4 గంటల వరకు విధుల్లోనే ఉండాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని
హెచ్చరించారు. శనివారం జగిత్యాల జిల్లాలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన
ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సూపరింటెండెంట్ సహా పత్తాలేని పలువురు : మంత్రి వచ్చిన సమయంలో ఆస్పత్రి
సూపరింటెండెంట్ రాములు విధుల్లో లేరు. దీంతో విచారణకు మంత్రి ఆదేశించారు. ఇక
స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వకుండానే మంత్రి మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు
నేరుగా ఆస్పత్రికి చేరుకున్నారు. దాదాపు గంటన్నర పాటు వార్డుల్లో కలియ
తిరిగారు. ఆ సమయంలో గైనకాలజిస్ట్ అరుణశ్రీ లీవ్ పెట్టకుండా వెళ్లిపోవడం,
పీడియాట్రిక్‌లోని ఇద్దరు ప్రొఫెసర్లు విధుల్లో లేకపోవడం, అనస్తీషి యా
సిబ్బంది అందుబాటులో లేకపోవడంతోపా టు, ఆప్తాల్మజీ అసిస్టెంట్ ప్రొఫెసర్
సుజాత లీవ్‌కు దరఖాస్తు చేయకుండా వెళ్లిపోవడంపై మంత్రి ఆ గ్రహం వ్యక్తం చేశారు.