సమాజంలోని ప్రజల్లో వినికిడి సమస్యలు తలెత్తకుండా చూడడానికి వారి ఆరోగ్య శక్తి
సామర్థ్యాలను పెంపొందించడానికి వినికిడి సంరక్షణ శిక్షణ మాన్యువల్‌ను ప్రపంచ
ఆరోగ్య సంస్థ (WHO) విడుదల చేసింది. వినికిడి లోపం, సాధారణ చెవి వ్యాధుల
నివారణ, గుర్తింపు, నిర్వహణపై మాన్యువల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో
పనిచేసే ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించవచ్చు. ఇది
వినికిడి విధానం, చెవి పరీక్ష, వినికిడి మూల్యాంకనం నిర్వహణ, సాధారణ చెవి
వ్యాధుల నివారణ, మాడ్యూల్స్‌ను కలిగి ఉంది. నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన
ప్రాక్టికల్ యాక్టివిటీస్‌ను ఇందులో చేర్చారు. “చెవి, వినికిడి సమస్యలు
సమాజంలో ఎదురయ్యే కొన్ని సాధారణ పరిస్థితులు” అని డబ్ల్యూహెచ్ఓ
నాన్‌కమ్యూనికేబుల్ డిసీజెస్ విభాగం డైరెక్టర్ డాక్టర్ బెంటే మిక్కెల్సెన్
అన్నారు. “ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ నుంచి మొదలుకొని, మరింత మంది ఆరోగ్య
కార్యకర్తలు, వైద్యులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ పరిస్థితులు తక్షణమే
గుర్తించడం, సంరక్షణ నిరంతరాయంగా నిర్వహించటం చాలా క్లిష్టమైనది. తద్వారా వారు
వారి కమ్యూనిటీలకు అవసరమైన చెవి, వినికిడి సంరక్షణ సేవలను అందించగలరు.”. అని
ఆయన వెల్లడించారు.