జీవో నెంబర్ 3 వల్ల ఉత్తరాంధ్ర బీసీలు భారీగా నష్టపోతున్నారు
*తక్షణమే తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించాలి *
తెలంగాణ కొప్పుల వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు పోలా లక్ష్మునాయుడు
హైదరాబాద్ : పదేళ్లు పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో విభజన చట్టాన్ని
ఉల్లంఘిస్తూ ప్రభుత్వం 26 బిసీ కులాలను తొలగించడంపై గవర్నర్ కు ఫిర్యాదు
చేసినట్లు తెలంగాణ కొప్పుల వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 3 వల్ల ఉత్తారంధ్ర బీసీలు భారీగా
నష్టపోతున్నారని తెలంగాణ కొప్పుల వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు పోలా
లక్ష్మునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి న్యాయం చేయాలని తెలంగాణ గవర్నర్
తమిళిసైని కలిసి విజ్ఞప్తి చేసినా ఇంతవరకు ఎలాంటి ఫలితం కనిపించలేదని
చెప్పారు. హైదరాబాద్‌లో స్థిరపడిన దాదాపుగా పది లక్షల మంది ఉత్తరాంధ్ర బీసీలకు
తెలంగాణ సర్కార్ అన్యాయం చేసిందన్నారు. ఈ జీవో వల్ల వారంతా బీసీ జాబితాలో
ఉండలేకపోతున్నారని, తద్వారా రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందలేకపోతున్నారని
గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని, జీవో నెంబర్ 3 తో బలహీన వర్గాలు హక్కులు
కోల్పోతున్నారని, విభజన తర్వాత ఆంధ్రలో బీసీలు హక్కులు కోల్పోతున్నారని ఆయన
ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ కొప్పుల
వెలమ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ
సర్కార్ 2014లోనే జీవో నెంబర్ 3 జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న
26 ముఖ్య కులాలను వెనుకబడిన తరగతుల(బీసీ) జాబితా నుండి తొలగిస్తూ ఆ జీవోలు
ఉత్తర్వులు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ కులాలను మాత్రమే జాబితాలో
కొనసా గించాలని నిర్ణయించింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణ లోని వివిధ
జిల్లాల్లో స్థిరనివాసం ఏర్పరచుకున్న ఏపీలోని ప్రధాన కులాలకు ప్రభుత్వం
అందించే పథకాలు, రాయితీలు అమలు చేయకుండా నిరోధించడానికే ఈ కులాలను బీసీ
జాబితానుండి తొలగించారు. బీసీ జాబితాలో ఉన్న కులాలను తొలగించడంతో ఈ ప్రధాన
కులాలకు చెందినవారంతా ఓసీ జాబితా కిందకి వచ్చారు. తెలంగాణ ప్రాంతంలో గవర,
కొప్పుల వెలమ, కాళింగ, తూర్పు కాపు, శెట్టి బలిజవంటి కులాలు లేవు. ఒకవేళ
ఉన్నా వారంతా స్థానికేతరులేనని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న
ప్రభుత్వం రోజుకో కీలక నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్రంలో ఉన్న 26 ముఖ్య కులాలను వెనుకబడిన తరగతుల(బీసీ) జాబితా నుండి
తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప డ్డాక రాష్ట్రంలో
అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ కులాలను మాత్రమే
జాబితాలో కొనసా గించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ లోని వివిధ
జిల్లాల్లో స్థిరనివాసం ఏర్పరచుకున్న ఏపీలోని ప్రధాన కులాలకు ప్రభుత్వం
అందించే పథకాలు, రాయితీలు అమలు చేయకుండా నిరోధించడానికే ఈ కులాలను బీసీ
జాబితానుండి తొలగించారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో వెనుకబడిన
తరగతుల్లో ప్రధాన కులాలయిన శెట్టి బలిజ(గౌడ), గవర, కొప్పుల వెలమ, కాళింగ,
తూర్పు కాపుతోపాటు మరికొన్ని కులాలను బీసీ జాబితాలో నుండి తొలగించారు. బీసీ
జాబితాలో ఉన్న కులాలను తొలగించడంతో ఈ ప్రధాన కులాలకు చెందినవారంతా ఓసీ జాబితా
కిందకి వచ్చారు. నిన్నటిదాకా బీసీ జాబితాలో ఉన్న తమను తెలంగాణ ప్రభుత్వం
తొలగించిందని, దీంతో తాము ఓసీలమయ్యామని మంచి ర్యాంకులు సాధించినా బీసీ
కేటగిరీలో తమకు ఇంజినీరింగ్ సీట్లు లభ్యమయ్యే అవకాశం లేదని విద్యార్ధులు, వారి
తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో గవర,
కొప్పుల వెలమ, కాళింగ, తూర్పు కాపు, శెట్టి బలిజవంటి కులాలు లేవని, ఒకవేళ
ఉన్నా వారంతా స్థానికేతరులేనని, అటువంటి వారికి, బీసీ కేటగిరీలో సీట్లు ఎలా
ఇస్తామని అధికారులు ప్రశ్నిస్తున్నారు. అన్ని కులాలను బీసీ జాబితాలో చేరిస్తే
ఫాస్ట్ పథకం తడిసి మోపెడవుతుందని, తెలంగానేతరులకు ఈ పథకం కింద ఫీజులు ఎలా
చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల
మధ్య నెలకొన్న సమస్యలను, ఇబ్బందులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని ఇరు
రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ సమక్షంలోనే ప్రకటించినా అందుకు విరుద్ధంగా
తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కులాలను బీసీ జాబితా నుండి తొలగించడం అన్యాయం.
హైదరాబాద్‌లో భవన నిర్మాణానికి సంబంధించి సెంట్రింగ్ పని చేసే కార్మికుల్లో
75శాతం మంది ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందినవారేనని, వీరిలో కాళింగ, గవర సామాజిక
వర్గాలకు చెందినవారు పెద్దసంఖ్యలో ఉన్నారని అంచనా. వీరందరికీ అన్యాయం
జరుగుతోంది. ఈ అంశంపై ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాజకీయ పార్టీల నేతలు హమీలు
ఇస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ సమస్య పరిష్కారం కాలేదు. తెలంగాణ గవర్నర్
తక్షణమే స్పందించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.